కనీసం బ్యాట్ ప‌ట్టుకోవ‌డానికి కూడా రాలేదు-పూజారా

ముంబై: ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జ‌రిగిన చివ‌రి టెస్ట్‌లో 89 ప‌రుగులు ఇన్నింగ్స్‌తో రిష‌బ్‌పంత్ హీరో అయ్యాడు. అంత‌కుముందు 91 ప‌రుగులు చేసి త‌న వంతు క్రెడిట్ అందుకున్నాడు. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్‌గిల్‌. కానీ ఈ మ‌ధ్య‌లో ఏది ఏమైనా టీమ్‌ను గ‌ట్టేక్కించాల‌న్న దృఢ సంక‌ల్పంతో ఆస్ట్రేలియా బౌల‌ర్ల బౌన్స‌ర్ల‌కు త‌న శ‌రీరాన్ని అడ్డుపెట్టి బ్యాటింగ్ చేసిన చెటేశ్వ‌ర్ పూజారాకు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. అత‌డు చేసింది 56 ప‌రుగులే అయినా ..రెండు సెష‌న్ల పాటు ఆసీస్ బౌల‌ర్ల‌ను అల‌సిపోయేలా చేశాడు. ఏకంగా 244 బంతులు ఆడాడు. ఈక్ర‌మంలో అత‌ని శ‌రీరం మొత్తం గాయాల‌య్యాయి. అయితే త‌న వేలికి త‌గిలిన గాయం మాత్రం చాలా తీవ్ర‌మైంద‌ని పూజారా చెప్పాడు.
బ్యాట్ ప‌ట్టుకోవ‌డానికీ రాక‌పోయినా..
మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో నా వేలికి గాయ‌మైంది. దీని కార‌ణంగా సిడ్నీ, బ్రిస్బేన్‌ల‌లో బ్యాటింగ్ చేయ‌డానికి చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. బ్రిస్బేన్‌లో మ‌ళ్లీ అక్క‌డే దెబ్బ త‌గ‌ల‌డంతో గాయం మ‌రింత తీవ్ర‌మైంది. ఆ త‌రువాత కనీసం బ్యాట్ ప‌ట్టుకోవ‌డానికి కూడా రాలేదు. నాలుగు వేళ్ల‌తోనే బ్యాట్ ను గ్రిప్ చేయాల్సి వ‌చ్చింది. అయినా ఎలాగోలా ఆడ‌లేదో కూడా పూజారా చెప్పాడు. త‌న పుల్ షాట్ అంత మెరుగ్గా ఉండ‌ద‌ని, పైగా ఆ స‌మ‌యంలో ఈషాట్ ఆడ‌బోయి వికెట్ పారేసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని అనిపించిన‌ట్లు పూజారా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *