న‌న్ను ఎవ‌రితోనూ పోల్చ‌డం నాకు ఇష్టం ఉండ‌దు…

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో అద్బుతంగా రాణించిన రిష‌బ్‌పంత్‌ను ధోనీతో పోలుస్తున్నారు. అందులోనూ బ్రిస్బేన్ టెస్ట్‌లో ధోనీ రికార్డును కూడా తిర‌గ‌రాయ‌డంతో ఈ పోలిక మ‌రింత ఎక్కువైంది. అయితే పంత్ మాత్రం త‌న‌ను ధోనీతో పోల్చోద్ద‌ని అంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని గురువారం ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ధోనీతో పోల్చొద్ద‌ని అత‌ను కోరాడు. ఎమ్మెస్ ధోనీలాంటి ప్లేయ‌ర్‌తో మాట్లాడాడు. చాలా బాగుంటుంది. కానీ న‌న్ను ఎవ‌రితోనూ పోల్చ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. ఇండియ‌న్ క్రికెట్‌లో నాకంటూ ప్ర‌త్యేకంగా పేరు సంపాదించుకోవాల‌ని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దృష్టంతా దానిపైనే . ఓ లెజెండ‌రీ ప్లేయ‌ర్‌తో ఓ యువ‌కుడిని పోల్చ‌డం స‌రికాదు అని పంత్ స్ప‌ష్టం చేశాడు. టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ (13) సాధించ‌డంపై స్పందిస్తూ.. చాలా బాగా అనిపిస్తోంది. కానీ ర్యాంకింగ్ గురించి నాకు తెలియ‌దు. ఇండియాను గెలిపించ‌డ‌మే నా ప‌ని అని పంత్ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *