సీఎం నిర్ల‌క్ష్యం వ‌ల‌నే రాష్ట్రం ఐటీఐఆర్ ను కోల్పోయింది…

హైద‌రాబాద్‌: రెండు పార్టీలు ఒక్క‌టి రాష్ట్రాన్ని మ‌రో పార్టీ ఏమో దేశాన్ని దోచుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాల‌న కొన‌సాగుతుంది. ఏడు సంవ‌త్స‌రాలైన ఐటీఐఆర్‌పై టీఆర్ ఎస్ క‌నీసం డీపీఆర్ ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కార‌ణంగానే రాష్ట్రం ఐటీఐఆర్‌ను కోల్పోయింద‌ని చెప్పారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివ‌ర్స్‌స్టాండ్ అని విమ‌ర్శంచారు. ఐటీఐఆర్‌కు స‌మాన‌మైన ప్యాకేజీ.. మంత్రి కేటీఆర్ ఇవ్వాల‌న‌డం దారుణ‌మ‌న్నారు.కేటీఆర్.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడ‌ని విమ‌ర్శించారు. కేటీఆర్ ద‌గ్గ‌ర అస‌లు ప్ర‌ణాళిక‌నే లేదు. లెట‌ర్ రాయ‌డం ఏంటి? అని ప్ర‌శ్నించారు.క‌మిష‌న్లు వ‌చ్చేదుంటే ఐటీఐఆర్ కు కూడా కేసీఆర్ డీపీఆర్ ఇచ్చేవార‌ని తెలిపారు. క‌మిష‌న్లు వ‌చ్చినందుకే కాళేశ్వ‌రాన్ని డీపీఆర్ లేకుండానే నిర్మించాడ‌ని చెప్పారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుంద‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *