మ‌న‌కు కొంత అద‌న‌పు భారోసా ఉంది- శ‌క్తికాంత్ దాస్‌

న్యూఢిల్లీ: ఇప్పుడు విప‌రీతంగా క‌రోనా కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఇంత‌కు ముందుకు మాదిరిగా మ‌ళ్ళీ అష్ట దిగ్బంధ‌నాల అవ‌స‌రం ఉండ‌ద‌ని భార‌తీ‌య రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చీఫ్ శ‌క్తికాంత్ దాస్ గురువారం చెప్పారు. ఆర్థిక కార్య‌కలాపాల పున‌రుద్ధ‌ర‌ణ ఆటంకాలు లేకుండా కొన‌సాగాల‌న్నారు. ఈ మ‌హ‌మ్మారి పెరుగుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికి మ‌న‌దేశం ఈ ప‌రిస్థితిని ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉంద‌న్నారు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుండ‌టాన్ని ఈ నేప‌థ్యంలో గుర్తు చేశారు. టైమ్స్ నెట్ వ‌ర్క్ నిర్వ‌హించినభార‌త్ ఎక‌న‌మిక్ కాంక్లేవ్‌లో ఆయ‌న ఈ వ్యాఖ్యాలు చేశారు. ఆర్థిక కార్య‌క‌లాపాల పున‌రుద్ధ‌ర‌ణ జ‌రిగింద‌ని, ఇది ఆటంకాలు లేకుండా కొన‌సాగాల‌ని అన్నారు. ఈసారి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావాన్ని త‌ట్టుకోవ‌డానికి మ‌న‌కు కొంత అద‌న‌పు భ‌రోసా ఉంద‌ని తెలిపారు. ఆయ‌న ప‌రోక్షంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను గుర్తు చేశారు. 2021-22 ఆర్థిక ఏడాదికి అంచ‌నా వేసిన వృద్ధి రేటు 10.5 శాతంలో త‌గ్గుద‌ల ఉంటుంద‌ని తాను భావించ‌డం లేద‌ని చెప్పారు. ప్రాథ‌మిక స‌మాచారం ఆధారంగా తాను ఈ వివ‌రాల‌ను చెప్తున్న‌ట్లు తెలిపారు. ద్ర‌వ్య ప‌ర‌మితి విధాన క‌మిటీ స‌మీక్ష అనంత‌రం ఏప్రిల్ 7న తుది అంచనాలు వెల్ల‌డ‌వుతాయ‌ని చెప్పారు. ఆర్బీఐ, బాండ్ మార్కెట్ మ‌ధ్య జ‌గ‌డం లేద‌న్నారు. ఈ రెండూ ప‌ర‌స్ప‌రం స‌హ‌కారాత్మ‌కంగా కొన‌సాగాల‌ని, ఘ‌ర్ష‌ణాత్మ‌కంగా ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు. ఓపెన్ మార్కెట్ ఆప‌రేష‌న్స్ పాటు ఇత‌ర చ‌ర్య‌ల ద్వారా మార్కెట్ ఆర్బీఐ మ‌ద్ద‌తిస్తుంద‌ని న‌రుద్ఘాటించారు. రుణ సేక‌ర‌ణ స‌జావుగా జ‌ర‌గ‌డానికి ఆర్బీఐ దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు, క‌రెన్సీ మార్క‌ట్లో ఆర్భీఐ జోక్యం గురించి శ‌క్తికాంతదాస్ మాట్లాడుతూ, క‌రెన్సీ నిల‌క‌డ‌గా ఉండ‌టం కోసం మాత్ర‌మే ఆర్బీఐ ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు.మ‌న‌దేశం2013 లో ఎదుర్కొన్న ఇబ్బందులు మ‌ళ్ళీ ఎదుర్కొన‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించిన విర‌వాల ప్ర‌కారం,బుధ‌వారం మ‌న‌దేశంలో 53,476 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌23 త‌రువాత రోజువారీ అత్య‌ధిక కేసులు న‌మోదు కావ‌డం ఇది తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *