దేశంలో ప్ర‌యివేట్ క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల‌ను నిషేధించాలి….

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ కూడా సొంత‌గా డిజిటల్ క‌రెన్సీ రూప‌క‌ల్ప‌నపై ఇప్ప‌టికే అంత‌ర్గ‌త క‌మిటీని వేసింది. బిట్ కాయిన్ లాంటి క‌రెన్సీ దేశ ఆర్థిక స్థిర‌త్వాన్ని దెబ్బ‌తీసే అవ‌కాశాలున్నాయ‌ని ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ అన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పెరిగిపోతున్న క్రిప్టోక‌రెన్సీల విలువ‌పై రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్ బిఐ) ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇదే విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లామ‌ని, త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనుంద‌న్నారు. దేశంలో ప్ర‌యివేట్ క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల‌ను పూర్తిగా నిషేధించి, దీంతో ఇప్ప‌టికే చైనాలోని ఎలక్ట్రానిక్ యువాన్‌తోపాటు డిజిట‌ల్ క‌రెన్సీ ఉన్న ఇత‌ర దేశాల జాబితాలో భార‌త్ చేర‌నుంద‌ని దాస్ తెలిపారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో క‌రెన్సీను నిషేధించాలంటూ ప్ర‌ముఖ బిలియ‌నీర్ ఇన్వెస్ట‌ర్ రాకేష్ ఝ‌న్‌ఝున్ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విష‌యం తెలిసిందే. బిట్‌కాయిన్ ట్రేడింగ్ జూదం తీవ్ర‌స్థాయికి చేరింద‌న్నారు. క్రిప్టోక‌రెన్సీలో పెట్టుబ‌డుల‌పై తన‌కు ఆస‌క్తి లేద‌ని… ఇన్వెస్ట‌ర్లు కూడా కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మైక్రోస్టాప్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *