రాయ‌ల‌సీమ‌లోని నేటి నుంచి ఎస్ఈసీ మూడురోజు ప‌ర్య‌టించ‌నున్నారు.

హైద‌రాబాద: ఈరోజు నుంచి రెండు రోజుల‌పాటు రాయ‌ల‌సీమ‌లోని మూడు జిల్లాల్లో ఎస్ఈసీ ని‌మ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ర్య‌టించ‌నున్నారు. అనంత‌పురం,క‌ర్నూల్ క‌డ‌ప జిల్లాల్లో నేడు, రేపు ఎస్ఈసీ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈరోజు క‌ర్నూలు , మ‌రియు అనంత‌పురం జిల్లాల్లో ఎస్ఈసీ ప‌ర్య‌టిస్తారు. ఈ నేడు ఉద‌యం విజ‌య‌వాడ నుంచి బెంగ‌ళూరుకు చేరుకుని అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో అనంత‌పురం వెళ్ల‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2గంట‌ల నుంచి3గంట‌ల వ‌ర‌కు అనంత‌పురం జిల్లా అధికారుల‌తో పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఎస్ ఈసీ స‌మీక్షించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి సాయంత్రం 5:30 గంట‌ల‌కు క‌ర్నూల్ చేరుకున్నారు. సాయంత్రం 6గంట‌ల నుంచి 7:30 గంట‌ల వ‌ర‌కు క‌ర్నూలు జిల్లా అధికారుల‌తో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష జ‌రుప‌నున్నారు. రాత్రికి క‌ర్నూలులో బ‌స చేయ‌నున్న ఎస్ఈసీ శ‌నివారం ఉద‌యం 6గంట‌ల‌కు క‌ర్నూలు నుంచి క‌డ‌ప బ‌య‌ల‌దేరి వెళ్ల‌నున్నారు.క‌డ‌ప‌లో శ‌నివారం ఉద‌యం 9గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు జిల్లా అధికారుల‌తో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై చేయ‌నున్నారు. శ‌నివారం 11:30 గంట‌ల‌కు క‌డ‌ప నుంచి బ‌య‌లు దేరి మ‌ధ్యాహ్నం 12:20 గంట‌ల‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ తిరిగి విజ‌య‌వాడ చేరుకొనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *