ప‌దిరోజులు నేను నిద్ర‌పోలేదు….

భార‌త్ జ‌ట్టు సీనియ‌ర్ స్పిన్న‌ర్ రవిచంద్ర‌న్ అశ్విన్ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోక‌డంతో ప‌ది రోజుల పాటు నిద్ర‌పోలేదని అన్నారు. త‌న‌వాళ్లు కోలుకోవ‌డంతో తిరిగి లీగులో పున‌రాగ‌మ‌నం చేయాల‌ని భావించినా వాయిదా పడింద‌ని వెల్ల‌డించారు. ఐపీఎల్ లో అశ్విన్ దిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆడాడు. కొన్ని మ్యాచులు ముగిశాక అత‌డు తిరిగి చెన్నై వెళ్లిపోయాడు. పిల్ల‌లు, వృద్ధులు స‌హా త‌న కుటుంబంలో ప‌ది మందికి పైగా కొవిడ్ బారిన ప‌డ‌ట‌మే కార‌ణం. అందులో కొంద‌రి ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మార‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మా ప్రాంతంలో దాదాపుగా అంద‌రూ క‌రోనా బారిన‌ప‌డ్డారు.మా బంధువుల్లో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఎలాగోలా కోలుకున్నారు.దాదాపు ప‌ది రోజుల వ‌ర‌కు నేను నిద్ర‌పోలేదు. దాంతో నాపై ఒత్తిడి పెరిగిపోయింది. అస‌లు నిద్ర‌లేకుండానే నేను మ్యాచులు ఆడాను. నాపై భారం ఎక్కువ అవ్వ‌డంతో ఐపీఎల్ వ‌దిలేసి ఇంటికి వెళ్లిపోయాను. అని యాష్ అన్నాడు. నేను ఐపీఎల్ వ‌దిలి ఇంటికి వ‌చ్చేట‌ప్పుడు మ‌ళ్లీ లీగు ఆడ‌గ‌ల‌నా అనిపించింది. కానీ ఆస‌మ‌యానికి అవ‌స‌ర‌మైన ప‌నే చేశాను. ఆ త‌రువాత కొన్నాళ్లు క్రికెట్ ఉండ‌ద‌ని అనుకున్నా. కుటుంబ స‌భ్యులు కోలుకోవ‌డంతో ఐపీఎల్లో పున‌రాగ‌మ‌నం చేయాల‌నుకున్నా ఇంతలోనే లీగ్ వాయిదా ప‌డింది. అని యాష్ తెలిపాడు. ఇప్పుడు అత‌డు భార‌త్ జ‌ట్టు తో క‌లిసి ముంబయిలో 14 రోజుల క్వారంటైన్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *