వారికి నా పై ఉన్న ప్రేమ‌ను గౌర‌విస్తాను.. అలాంటి ప్ర‌చారం ‌వ‌ద్దు..

హైద‌రాబాద్: ఇప్పుడు ఇలాంటి ప్ర‌చారాల‌ను మానుకోవాలంటూ ర‌త‌న్ టాటా త‌న ట్విట్ట‌ర్ వేదిక యూజ‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. టాటా సంస్థ‌ల అధినేత టాటాకు భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.. అవార్డు విష‌యంలో కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నార‌ని, అయితే వారి నాపై ఉన్న గౌర‌విస్తాన‌ని, కానీ అలాంటి ప్ర‌చారాల‌ను నిలిపివేయాల‌ని మ‌న‌స్సు పూర్తిగా వేడుకుంటున్న‌ట్లు ర‌త‌న్ టాటీ త‌న ట్వీట్‌లో తెలిపారు. భార‌తీయుడిగా పుట్టినందుకు గ‌ర్విస్తున్నాన‌ని, దేశ ప్ర‌గ‌తికి స‌హాక‌రించేందుకు ఎప్పుడూ సిద్ధ‌మేన‌న్ని ర‌త‌న్‌టాటా అన్నారు. మోటివేష‌న‌ల్ స్వీక‌ర్ డాక్ట‌ర్ వివేక్ చింద్రా సోష‌ల్ మీడియాలో ఈమ‌ధ్య క్యాంపేయిన్ స్టార్ చేశారు. ర‌త‌న్ టాటాకు భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ ఆయన సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ ట్రెండ్ అయ్యింది. ట్విట్ట‌ర్ యూజ‌ర్ల నుంచి వివేక్ ట్వీట్ కు భారీ మ‌ద్ద‌తు ల‌భించింది. ఈనేప‌థ్యంలో ర‌త‌న్ టాటా త‌న ట్వీట్‌లో ఇవాల స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *