ఇషాంత్‌శ‌ర్మ‌ను జ్ఞాపిక‌తో స‌త్క‌రించిన రాష్ట్రప‌తి

అహ్మ‌దాబాద్: భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన త‌రువాత ఆయ‌న భార‌త్ , ఇంగ్లాండ్ ప్లేయ‌ర్స్‌ను క‌లిశారు. భార‌త్ త‌ర‌పున వందో టెస్ట్ ఆడుతున్న పేస్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మకు జ్ఞాపిక‌తో స‌త్క‌రించారు. ప‌క్క‌నే ఉన్న హోంమంత్రి అమిత్‌షా.. ఇషాంత్‌కు ప్ర‌త్యేక‌మైన క్యాప్ అందించారు. ఆ త‌రువాత రెండు జ‌ట్ల కెప్టెన్లు కోహ్లీ, రూట్… టీమ్ ప్లేయ‌ర్స్‌ను రాష్ట్రతికి ప‌రిచ‌యం చేశారు. ఇక ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్టేడియంలో వందో టెస్ట్ ఆడుతున్న ఇషాంత్‌కే తొలి బంతి వేసే అవ‌కాశం రావ‌డం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *