అన్న‌దాత‌ల క‌ష్టసుఖాలు నాకు తెలుసు…

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఘాట్ వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ పుట్టుక‌తోనే సంప‌న్నుడు అని..తాను రైతు కుటుంబంలో జ‌న్మించాన‌ని, అన్న‌దాత‌ల క‌ష్టసుఖాలు త‌న‌కు తెలుస‌ని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మీడియా సంస్థ ఏ ఎన్ైకి రాజ్‌నాథ్ ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి వెన్నెముక అయిన‌టువంటి రైతుల‌ను న‌క్స‌ల్స్‌, ఖ‌లీస్తానీల‌తో పోల్చ‌డంపై రాజ్‌నాథ్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అన్న‌దాత‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాహుల్ వ‌య‌సులోత‌న‌కంటే చిన్న‌వాడు..అత‌ని కంటే వ్య‌వ‌సాయం గురించి త‌న‌కు బాగా తెలుసు. ఎందుకంటే తాను రైతు దంప‌తుల క‌డుపులో జ‌న్మించాడు. అటువంట‌ప్పుడు రైతుల‌కు వ్య‌తిరేక‌మైన నిర్ణ‌యాలు ఎలా తీసుకుంటాము? మ‌న ప్ర‌ధాని మంత్రి కూడా ఓ పేద త‌ల్లి కడుపులో జ‌న్మించారు. తాను చెప్పేదే ఒక్క‌టే.. అన్న‌దాత‌ల‌కు వ్య‌తిరేకంగా ఏప‌ని చేయ‌ము అని రాజ్‌నాథ్ స్ప‌ష్టం చేశారు. రైతుల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఈ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకొచ్చాము. వాటిని రెండేళ్ల పాటు అమ‌లు చేయ‌నివ్వాలి అని ఆయ‌న కోరారు. రైతుల ఆందోళ‌న‌ల‌తో ప్ర‌భుత్వం బాధ‌తో ఉంద‌ని రాజ్‌నాథ్ పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *