ర‌జినీ రాజ‌కీయాల్లోకి రావాలి…. అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న ….

చెన్నై: త‌మిళ‌సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ చెన్నై లో ఆయ‌న అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. అనారోగ్యం కార‌ణంగా రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నానంటూ ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కితీసుకోవాల‌ని వారు కోరారు. చెన్నై లోనివ‌ళ్లు వార్ కొట్ట‌మ్ లో జ‌రిగిన ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వంద‌లాది మంది ర‌జినీకాంత్ అభిమానులు పాల్గొన్నారు. మ‌రికొన్ని నెల‌ల్లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ర‌జినీకాంత్ గ‌త డిసెంబ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఆ త‌రువాత కొద్ది రోజుల‌కే ఆయ‌న స్వ‌ల్ప అనాగ్యానికి గురై కోలుకున్నారు. కానీ, అనారోగ్యం కార‌ణంగా రాజ‌కీయ రంగప్ర‌వేశం చేయాల‌న్న త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈనేప‌థ్యంలో తాజాగా ఆయ‌న అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి రజినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న త‌మ ఆకాంక్ష‌ను వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *