నా నిర్ణ‌యంలో మార్పులేదు… రాజ‌కీయాల్లోకి రాను….

చెన్నైః ర‌జినికాంత్ రాజ‌కీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు ఆదివారం చెన్నైలో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌డంపై ఆయ‌న స్పందించారు. త‌ను రాజ‌కీయాల్లోకి రాబోన‌న‌ని, ఆవిష‌యంలో తీసుకున్న నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు ఉండ‌బోద‌ని ర‌జినీకాంత్ స్ప‌ష్టంచేశారు. ర‌జినీ మ‌క్క‌ల్ మంద్ర‌మ్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన శ్రేణుల‌తో క‌లిసి త‌న అభిమానులు కొంద‌రు ఆదివారం చెన్నైలో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించార‌ని, రాజ‌కీయాల్లోకి రానంటూ తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ఆ ప్ర‌ద‌ర్శ‌న‌లో డిమాండ్ చేశార‌ని ర‌జినీకాంత్ గుర్తుచేశారు. అయితే, తాను తీసుకోవాల్సిన నిర్ణ‌యం ఇప్ప‌టికే తీసుకున్నాన‌ని, ఇక ఆ నిర్ణ‌యాన్ని మార్చుకునే ఆలోచ‌న లేద‌ని తెలిపారు. నేను ప్ర‌తి ఒక్క‌రికీ విజ్ఞ‌ప్తి . నేను నేనంటే గిట్ట‌ని వాళ్లు చేసే ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ద‌య‌చేసి పాలుపంచుకోకండి. అని త‌న అభిమానులను ఉద్దేశించి ర‌జినీకాంత్ వ్యాఖ్యానించారు. అలాంటి ఘ‌ట‌న‌లు త‌న‌ను బాధిస్తాయ‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *