విన‌త క‌ద్రువ‌ల జీవిత‌చ‌రిత్ర‌……

కృత‌యుగంలో విన‌త క‌ద్రువ‌లు త‌మ‌కు పుత్ర‌సంతానం కావాల‌ని త‌మ‌భ‌ర్త అయిన క‌శ్య‌ప ప్ర‌జాప‌తిని వేల సంవ‌త్స‌రాలు సేవించారు. క‌శ్య‌పుడు అనుగ్ర‌హించి మీకు ఏం కావాల‌లో కోరుకోండి అన్నాడు. అప్పుడు క‌ద్రువ అన‌ల‌తేజులు, దీర్ఘ‌దేహులు, బ‌ల‌సంప‌న్నుల‌యిన వెయ్యిమంది కుమారుల‌ను కావాల‌ది. విన‌త అంత‌కంటే బాహుబ‌లులైన ఇద్ద‌రు కుమారుల‌ను ప్రసాదించ‌మ‌ని కోరింది. క‌శ్య‌పుడు ఎంతో చాలా కాలం త‌పస్సు చేసి,, పుత్ర‌కామేష్ఠిచేసి, విన‌త క‌ద్రువ‌లు వాల కోరిక మేర‌కు వ‌రాలిచ్చి, గ‌ర్భాల‌ను ఉపాయంతో కాపాడుకొమ్మని చెప్పాడు. కొంత‌కాలానికి గ‌ర్భాలు అండాలుగా మారాయి. వాటిని నేతికుండ‌లో వుంచి ర‌క్షిస్తూ ఉండ‌గా, ఐదువంద‌ల ఏండ్ల‌ల‌కు క‌ద్రువ అండాలు ప‌గిలి శేషుడు,వాసుకి,ఐరావ‌తుడు, త‌క్ష‌కుడు, క‌ర్కోట‌కుడు, మొద‌లైన వెయ్యి మందిపుట్టారు. త‌న గ‌ర్భాండాలు ప‌గిలి ఇద్ద‌రు ప్రియ‌నంద‌నులు క‌లుగ‌లేద‌నే బాధ‌తో, భ‌యంతో, సిగ్గుతో విన‌త గుడ్డును ప‌గ‌లుగొట్టింది. అందులో నుంచి క్రింది అర్థ‌శ‌రీరంలేని అనూరుడైన విక‌లాంగుడు అరుణుడ‌నేవాడు పుట్టాడు. పూర్తి శ‌రీరం ఏర్ప‌డ‌క‌ముందే గ‌డ్డును ప‌గ‌గొట్టింది. అలా చేయ‌డం వ‌ల్ల‌న న‌న్ను ఇలా పుట్టించిన నీవు ఐదువంద‌ల ఏండ్లు నీ స‌వ‌తి క‌ద్రువ‌కు దాస్యం చేస్తావు. అని శంపించాడు. మిగిలిన ఈ అండాన్నైనా ప‌గిలేవ‌ర‌కు ఉండ‌నియ్యి. పుట్ట‌బోయే కుమారుడు మ‌హాబ‌ల సంప‌న్నుడు. నీకు దాస్య విముక్తి చేస్తాడు. అని చెప్పి సూర్యునికి ర‌థ‌సార‌థిగా ఉండాల‌నికి వెళ్ళాడు.
క్షీర‌సాగ‌ర‌మ‌థ‌నం
దేవ‌త‌లు రాక్ష‌సులు క‌లిసి అమృతాన్ని పొంద‌గోరి విష్ణు,బ్ర‌హ్మ‌ల‌తో సంప్ర‌దించి పాల స‌ముద్రాన్ని మ‌థించాల‌ని పూనుకున్నారు. పొడ‌వు, ఎత్తు ప‌ద‌కొండు యోజ‌నాలున్న మంథ‌ర‌గిరి ప‌ర్వతాప‌న్ని ఆదిశేషుడు ఎత్త‌గా తెచ్చి, పాల స‌ముద్రంలో వేసి, మునిగిపోకుండా ఆదికూర్మాన్ని నియోగించి, క‌వ్వంగా వాసుని చేసి మ‌థించారు. వాసుకి ముఖాల వ‌రుస నుంచి విషం పుట్టి న‌లువైపునా విస్ఫులింగాల‌ను
వెద‌జ‌ల్ల‌గా, ఆవిషాన్ని శంకరుడు మ్రింగి, కంఠంలో నిలుపుకున్నాడు. ఇంకా ఆ స‌ముద్రంలో నుంచి జ్యేష్ఠ్యాదేవి,చంద్రుడు, ల‌క్ష్మీదేవి,కౌస్తుభ‌మ‌ణి, ఉచ్చైశ్ర‌వ‌మ‌నే తెల్ల‌నిగుర్రం, అమృతంతో నిండిన తెల్ల‌ని కమండ‌లం ధ‌రించిన ధన్వంత‌రి అనేదైవ‌వైద్యుడు, ఐరావ‌త‌మ‌నే తెల్ల ఏనుగు మొదలైనవి పుట్టాయి. వాటిలో విష్ణుమూర్తి ల‌క్ష్మీదేవిని, మ‌ణిని స్వీక‌రించాడు. ఐరావ‌తాన్ని అస్స‌ర‌స‌లు, క‌ల్ప‌వృక్షం ,కామ‌ధేనువుల‌ను ఇంద్రుడు స్వీక‌రించాడు. అమృతాన్ని రాక్ష‌సులు తీసుకోగా విష్ణుమూర్తి మోహినీ అవ‌తార‌మెత్తి, రాక్ష‌సుల నుంచి అమృతాన్ని తిరిగి గ్ర‌హించి దేవ‌త‌ల‌కు పంచాడు.
దేవ‌త‌ల వ‌రుస‌లో కూర్చుని రాహువు అనేరాక్ష‌సుడు అమృతాన్ని తాగ‌బోగా, సూర్య‌చంద్రులు వాణ్ణి గుర్తించి విష్ణువుకు చెప్పారు. విష్ణువు చ‌క్రంతో వాని శిర‌స్సు ఖండించాడు. అమృతం గొంతులో ఉన్నందువ‌ల్ల వాని శిర‌స్సు అమ‌ర‌మైంది. నాటి నుంచి రాహువుకు సూర్య‌చంద్రుల‌తో శాశ్వ‌త విరోధం ఏర్ప‌డింది.
అమృతం దొర‌క‌ని రాక్ష‌సులు కోపించి ,త‌మ రాజైన బ‌లిచ‌క్ర‌వ‌రి సార‌థ్యంలో దేవ‌త‌ల మీదికి యుద్ధానికి దిగారు. దేవ‌త‌ల ప‌క్షాన న‌ర‌నారాయ‌ణులు విలాయ‌తాడ‌వం చేశారు. ఘోర‌యుద్ధం జ‌రిగింది. చివ‌రికి రాక్ష‌సులు పారిపోయారు. మంథ‌ర‌గిరి ప‌ర్వ‌తాన్ని య‌థాస్థానంలో ఉంచి త‌మ‌త‌మ నివాసాల‌కు వెళ్ళి సుఖంగా ఉన్నారు.
ఒక‌నాడు ఉచ్చైశ్ర‌వం పాల‌స‌ముద్రం తీరంలో తిరుగుతుండ‌గా, విహారానికి వచ్చిన విన‌తాక‌ద్రువ‌లు ఆ శ్వేత‌వ్వాన్ని చూచి దానితోక న‌ల్ల‌గా ఉంద‌ని క‌ద్రువ,లేదు తెల్ల‌గా ఉంద‌ని విన‌త అనుకుని ఓడిన‌వారు గెలిచిన‌వారికి దాస్యం చేయాల‌ని పందెం వేసుకున్నారు. ఇప్పుడే వెళ్ళి చూద్దామ‌ని విన‌త కోరింది. ప‌తి సేవ‌కు స‌మ‌య‌మ‌యింది. రేపు వ‌చ్చి చూద్దామ‌ని క‌ద్రువ చెప్ప‌గా,ఇద్ద‌రూ గృహాల‌కు వెళ్ళారు. క‌ద్రువ త‌న కుమారుల‌ను పిలిచి,త‌మ పందెం గురించి చెప్పి, మీరు గుర్రం తోక‌కు చుట్టుకుని దాన్ని న‌ల్ల‌గా క‌న‌బ‌డేట‌ట్లు చేయాల‌ని కోరింది. త‌ల్లి చెప్పినా స‌రే మేము అధ‌ర్మం చేయ‌మ‌ని అంద‌రూ అంద‌రూ నిరాక‌రించ‌గా , క‌ద్రువ ఆగ్ర‌హించి జ‌న‌మేజ‌యుడు చేయ‌బోయే స‌ర్ప‌యాగంలో మీరంద‌రూ మ‌ర‌ణం పొందుదురుగాక అని శ‌పించింది. ఈ శాపానికి భ‌య‌ప‌డి క‌ర్కోట‌కుడు అనేవాడు త‌ల్లి ఆజ్ఞ‌ప్ర‌కారం వెళ్ళి గుర్రం తోక‌కు చుట్టుకుంటాడు. మ‌రునాడు క‌ద్రువ విన‌త‌లు వెళ్ళి చూడ‌గా, దానితోక న‌ల్ల‌గా క‌న‌బ‌డుతుంది. విన‌త ఓడి క‌ద్రువ‌ల‌కు దాసి అయి ఐదువంద‌ల సంవ‌త్సరాలు ఊడిగం చేసింది.

తరువాయి భాగం-రేపు……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *