చివ‌రికి మీరే గెలుస్తారు -కేంద్రంపై వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు…

దిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ కొత‌ర‌ను అధిమించేందుకు వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాల‌కు అనుమ‌తులు ఇచ్చే ప్ర‌క్రియ‌ను కేంద్రం వేగ‌వంతం చేసింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ విష‌యంపై కేంద్రానికి లేఖ రాశారు. ఈక్ర‌మంలో కేంద్రం నిర్ణ‌యం వెలువ‌డ‌టంపై ఆయ‌న స్పందించారు. మొద‌ట వారు మిమ్మ‌ల్ని విస్మ‌రిస్తారు. త‌రువాత న‌వ్వుతారు. మీతో పోరాడ‌తారు. చివ‌రికి మీరే గెలుస్తారు. అంటూ కేంద్రం పై వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యాలో అభివృద్ధి అయిన స్పుత్నిక్ టీకాను ఇండియా అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదించిన వార్త‌ను షేర్ చేస్తూ రాహుల్ ఈ విమ‌ర్శ‌లు చేశారు. కాగా, కేంద్రం కొత్త‌గా తీసుకున్న నిర్ణ‌యంలో విదేశాల్లో ఇప్ప‌టికే వినియోగిస్తోన్న మోడెర్నా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌, ఫైజ‌ర్ టీకాల‌ను మార్గం సుగ‌మం కానుంది. కొవిడ్ టీకాల‌కు సంబంధించి కొద్ది రోజుల క్రితం రాహుల్ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇత‌ర టీకాల అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు మంజూరు చేసే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని దానిలో సూచించిన విష‌యం తెలిసిందే. దానిపై అధికార పార్టీ నేతలు విమ‌ర్శ‌లు చేశారు. ఇక కొత్త‌గా దేశ‌వ్యాప్తంగా 1,84,372 తాజా కేసులు న‌మోద‌యి, 1,027 మృతి చెందారు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు కేంద్రం 11 కోట్ల‌కు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *