కొవిడ్ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది ….

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భార‌త‌దేశంలో కొవిడ్ విజృంభిస్తోన్న ప‌ట్టించుకొని కేంద్ర‌
ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. క‌రోనా సెకండ్ వేవ్ విప‌రీతంగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు అల‌డిపోతున్నారు. ఆర్థికంగా నీరుపేద‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కొవిడ్ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలోవ్య‌వ‌స్థ విఫ‌ల‌మైంది. అని ఆరోపించారు. జ‌న్‌కీ బాత్ ముఖ్యం అంటూ నేడు ట్వీట్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న సంద‌ర్బంలో కార్య‌క‌ర్త‌లంతా రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌ను, ప‌నుల‌ను ప‌క్క‌న పెట్టి క‌రోనా రోగుల‌కు, వారి బంధువుల‌కు స‌హాయం అందిస్తూ వారి బాధ‌ల‌ను త‌గ్గించాల‌ని కాంగ్రెస్ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఇది కాంగ్రెస్ కుటుంబం ధ‌ర్మం. అని ట్వీట్ చేశారు. దేశానికి ప్ర‌స్తుతం బాధ్య‌తాయుత‌మైన వ్య‌క్తులు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. పార్టీ నేత‌లు త‌మ‌కు తాముగా ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌ల సేవ‌లో పాల్గొనాల‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *