భార‌తదేశంలో త‌యారు చేయ‌డం ప్ర‌తి భార‌తీయుడికి గ‌ర్వ‌కార‌ణ‌మే…

న్యూఢిల్లీః డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ద్వారా ఆమోదం పొందిన రెండు కొవిడ్ వ్యాక్సిన్లు భార‌త్ లో త‌యార‌వ‌డం ప్ర‌తి భార‌తీయుడికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఆదివారం భార‌త్ బ‌యోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్లు కొనాగ్జిన్‌, కొవిషీల్డ్‌కు దేశంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇచ్చిన క్ర‌మంలో హ‌ర్హం వ్య‌క్తం చేశారు. అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమతి ఇచ్చిన రెండు వ్యాక్సిన్లు భార‌తదేశంలో త‌యారు చేయ‌డం ప్ర‌తి భార‌తీయుడికి గ‌ర్వ‌కార‌ణ‌మే. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ అద్భుత‌మైన ప‌ని చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్ర‌వేత్త‌లు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు , క‌రోనా యోధులంద‌రికీ మేం కృత‌జ్ఞులం, అంటూ ట్వీట్ చేశారు. ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడినవారికి మేం ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం అని ట్వీట్ చేశారు. కొవిడ్‌పై పోరాటాన్ని బ‌లోపేతం చేసేందుకు ఇది నిర్ణ‌యాత్మ‌క మ‌లుపు అని, ఆరోగ్య‌క‌ర‌మైన ..కొవిడ్ ర‌హిత దేశం దిశ‌గా వేగ‌వంత‌మైన బాట‌లు వేస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా శాస్త్ర‌వేత్త‌లు, ఆవిష్క‌ర్త‌ల‌కు అభినంద‌న‌లు చెప్ప‌డంతో పాటు దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *