ఇరు సంస్థ‌లు ప‌ర‌స్ప‌ర స‌హాకారంతో రైతుల‌కు మెరుగైన సల‌హాలు..

హైద‌రాబాద్‌: రానున్న రోజుల్లో ఈ -రైతు వైబ్ సైట్ రూపొందించి దాని ద్వారా రైతుల‌కు వ్య‌వ‌సాయ సూచ‌న‌లు అందించ‌నున్నారు. అలాగే రాష్ట్రంలో 30 కేంద్రాల ను ఏర్పాటు చేసి రైతుల‌కు వ్య‌వ‌సాయ సాగు విధానాలు , యాజ‌మాన్య‌ప‌ద్ద‌తులు, సాయిల్ టెస్టింగ్, నీటి ప‌రీక్ష‌, వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌లో భాగంగా క‌స్ట‌మ్ హైరింగ్ సేవ‌ల‌ను అందించ‌నున్నారు.హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌తిమ అగ్రిస‌ర్వీసెస్‌, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంతో ఒక అవ‌గాహ‌నా (ఎంఓయూ) కుదుర్చుకుంది. వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ అవ‌గాహ‌నా ఒప్పంద కార్య‌క్ర‌మం యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ డా. ప్ర‌వీన్ రావు స‌మక్షంలో జ‌రిగింది. రైతుల‌కు ఆధునిక సాప్ట్‌వేర్ టెక్నాల‌జీని వినియోగించి మెరుగైన సాంకేతిక స‌ల‌హాలు అందించేందుకు ఇందుకోసం వ్య‌వసాయ విద్య‌ను అభ్య‌సించిన గ్రాడ్యుయేట్ల‌ను,డిప్లోమా పూర్తి చేసిన విద్యార్థుల‌కు ప్ర‌తిమ అగ్రిక‌ల్చ‌ర్ సర్వీసెస్ సంస్థ రిక్రూట్ చేసుకోనుంది. ఇరు సంస్థ‌లు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో రైతుల‌కు మెరుగైన వ్య‌వ‌సాయ‌ స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించ‌డానికి కృషి చేస్తాయ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *