రాష్ట్రంలో ప‌దిరోజులు జైజ‌వాన్‌, జైకిసాన్ ఉద్య‌మం…

ల‌క్నో: మోదీ స‌ర్కార్ తీసుకువ‌చ్చిన సాగుచ‌ట్టాల‌పై ప్ర‌జ‌లు దుమ్మెత్తిపోస్తున్నారు.రైతుల‌కు వ్య‌తిరేకంగా చేసిన చట్టాల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతున్న క్ర‌మంలో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో, జైజ‌వాన్‌… జైకిసాన్‌, ఉద్య‌మాన్ని కాంగ్రెస్ బుధ‌వారం ప్రారంభించ‌నుంది. ఇందులో ఆపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన‌నున్నారు. స‌హ‌ర‌న్‌పూర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న కిసాన్ మ‌హా పంచాయ‌త్ కార్య‌క్ర‌మంలో ప్రియాంక గాంధీతో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పాల్గొంటార‌ని యూపీ కాంగ్రెస్ మీడియా క‌న్వీన‌ర్ ల‌ల‌న్ కుమార్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ప‌ది రోజుల పాటు జైజ‌వాన్ , జైకిసాన్‌, ఉద్య‌మం జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలోని 27 జిల్లాలో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌ని, సీనియ‌ర్ నేత‌లు పాల్గొన‌నున్న‌ట్టు పేర్కొన్నారు. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన కాంగ్రెస్ ఈకార్య‌క్ర‌మంలో వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప‌ట్టు సాధించాల‌ని భావిస్తోంది. ప్రియాంక త‌న ప‌ర్య‌ట‌న‌లో శ‌కుంభ్రేదేవి ఆల‌యంలో పూజాలు చేయ‌నున్నారు. 13న బిజ్నూర్‌, ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాల్లోని రైతుల‌ను కావాల‌ని సైతం భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *