వ‌చ్చే నెల‌1 నుంచి 60 ఏళ్లు పైబ‌డిన వారికి క‌రోనా టీకా…

న్యూఢిల్లీ: గ‌త ఏడాది నుంచి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడుస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారికి స్వ‌స్తి చెప్ప‌డానికి మార్చి 1 నుంచి కొవిడ్ టీకా 60 సంవ‌త్స‌రాల పైబ‌డిన వారికి ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం వెల్ల‌డించారు. అంతేకాదు రెండు, అంత‌క‌న్నా ఎక్కువ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న 45 సంవ‌త్స‌రాల పైబ‌డిన వ్య‌క్తుల‌కు కూడా ఇస్తామ‌ని చెప్పారు. భార‌త‌దేం మొత్తం 10వేల ప్ర‌భుత్వం ,20 వేల ప్రైవేటు వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌లో వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ సెంట‌ర్ల లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రైవేట్ ఆసుప‌త్రుల‌తో వ్యాక్సిన్ వేసుకోవాల‌ని అనుకునే వాళ్లు డ‌బ్బులు చెల్లించాల‌ని జ‌వ‌దేక‌ర్ చెప్పారు.దీనికోసం ఎంత డ‌బ్బు చెల్లించాలోవ‌చ్చే మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్య శాఖ నిర్ణ‌యిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *