కొవిడ్ టీకా తీసుకున్న ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల‌

హైద‌రాబాద్‌:తెలంగాణరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌రోనా టీకా తీసుకున్నారు. హుజూరాబాద్‌లోని ప్రాంతీయ ద‌వాఖాన‌లో కొవిషీల్డ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడుత క‌రోనా టీకా ప్రారంభ‌మ‌య్యింది. ఇందులో భాగంగా 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌వారితో పాటు దీర్ఘ‌కాలి వ్యాధిగ్ర‌స్థుల‌కు వ్యాక్సినేష‌న్ వేయ‌నున్నారు. రెండోవ రేట‌గిరీల్లో 50 ల‌క్ష‌ల మంది ఉంటార‌ని అధికారులు అంచ‌నావేస్తున్నారు. తొలి రోజు 90 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారికి క‌రోనా టీకీ పంపిణి చేస్తారు. రాష్ట్రంలోని 48 ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లు, 45 ప్రైవేట్ హాస్పిట‌ళ్ల‌లో టీకా వ‌స్తారు. cowin.gov.in లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారికి టీకా ఇవ్వ‌నున్నారు.భార‌త‌దేశ‌వ్యాప్తంగా రెండోవ ద‌శ క‌రోనా పంపిణీ ప్రారంభ‌మయ్యింది. ఇందులో భాగంగా ప్ర‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్నారు. హైద‌రాబాద్ కంపెనీ అయినభార‌త్ బ‌యోటెక్ త‌యారు చేసిన కొవాగ్జిన్‌ను ప్ర‌ధాని వేయించుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌రోనాపై క‌రోనాపై జ‌రుగుతున్న‌
పోరులో శాస్త్ర‌వేత్తలు, డాక్ట‌ర్లు చేస్తున్న కృషిని ప్ర‌ధాని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *