యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌కు వాక్సిన్లు అందిస్తున్నాం….

న్యూఢిల్లీ: భార‌త‌దేశం వైపు ప్ర‌పంచం మొత్తం దృష్టి పెట్టిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.ఈ రోజు రాజ్య‌సభ‌లో ప్ర‌ధాని ప్ర‌సంగించారు. రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా రిప్లై ఇచ్చారు. భార‌త్ పై ప్ర‌తి ఒక్క‌రి అంచ‌నాలు పెరిగాయ‌ని, ఈ భూగోళం బాగు కోసం భార‌త‌దేశం ఏదైనా చేస్తుంద‌న్న నమ్మ‌కం వారిలో పెరిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇండియా నిజంగానే అవ‌కాశాలు క‌ల్పించే నేల అని, అనేక అవ‌కాశాలు ఎదురుచూస్తున్నాయ‌ని, ఉత్సాహాంతో ఉర‌క‌లేస్తున్న ఈ దేశం…ఎటువంటి అవ‌కాశాల్ని వ‌దలిపెట్ట‌ద‌ని ఆయ‌న అన్నారు. ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్య‌స‌భ‌లో 50మంది ఎంపీలు మాట్లాడార‌ని,సుమారు 13 గంట‌ల పాటు వారు అభిప్రాయాల‌ను వెలిబుచ్చార‌ని, వారంతా త‌మ అమూల్య‌మైన అభిప్రాయాల‌ను వెల్ల‌డించారని, ఆ ఎంపీలంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు మోదీ తెలిపారు. క‌రోనా మ‌మ్మాహ‌రి కార‌ణంగా లాక్‌డౌన్ విధించారు. ఆస‌మ‌యంలో దీపాలు వెలిగించిన సంఘ‌ట‌న గుర్తు చేస్తూ…. కొంద‌రు ఆ ఘ‌ట‌న‌ల‌ను వెక్కిరించారిన ప్ర‌ధాని మోదీ అన్నారు. రోడ్డుపై గుడిసెలోఉన్న వ్య‌క్తి దేశ ర‌క్ష‌ణ ,కేమం కోసం దీపం వెలిగిస్తే.. అత‌న్ని మ‌నం వెక్కిరిస్తున్నామ‌ని , ఎన్న‌డూ స్కూల్‌కు వెళ్ల‌ని ఓ వ్య‌క్తి ఈదేశం కోసం దీపం వెలిగిస్తే, వారిని కొంద‌రు ఆట‌ప‌ట్టిస్తున్నార‌ని మోదీ ఆరోపించారు. పోలియో, మ‌సూచీ లాంటి వ్యాధులు ఇండియాలో తీవ్ర ఉత్పాతాన్ని సృష్టించాయ‌ని, ఆ రోజుల్లో వ్యాక్సిన్ ఎవ‌రికి అందుతుందో తెలియ‌లేద‌ని, కానీ ప్ర‌స్తుతం మ‌న దేశం యావ‌త్ ప్ర‌పంచ‌ము కోసం వ్యాక్సిన్లు త‌యారు చేస్తున్న‌దని, ఇది మ‌న ఆత్మ‌స్థైర్యాన్ని పెంచుతున్న‌ద‌ని
ప్ర‌ధాని మోదీ అన్నారు. కోవిడ్ వేళ‌… మ‌న ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని, స‌హ‌కార స‌మాఖ్య‌కు స్పూర్తిగా నిలిచామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *