ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో వైమానిక ద‌ళం ప్రధాన పాత్ర‌-మోదీ

న్యూడిల్లీ: ఇప్పుడు ఎక్క‌డ చూసిన క‌రోనా మ‌హ‌మ్మారి విరుచుక‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దేశంలో వేర్వేక దేశాల ఒత్తిడిల‌కు లోబ‌డి లేద‌ని, స్వీయ సంకల్పంతోనే ముందుకు న‌డుస్తున్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. భార‌త్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి క‌రోనా నుండి కాపాడుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ద‌రించాలి, ప‌రిస‌రాల‌ను శుభ‌రంగా ఉంచుకోవాలన్నారు. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ ఆదివారం త‌న రేడియో కార్య‌క్ర‌మం మన్‌కీబాత్ లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ముచ్చ‌టించారు. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభంలో క‌రోనా రోగంపై ఉద్య‌మం గురించి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌స్తావించారు. దేశం త‌న సంపూర్ణ‌శ‌క్తి యుక్తుల‌తో క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాడుతోంద‌ని పేర్కొన్నారు. తౌతే,యాస్ తుఫాను, స్వ‌ల్ప భూకంపాల గురించి కూడా ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తావించాడు. ఆ విప‌త్తులు అనేక రాష్ట్రాల‌ను ప్ర‌భావితం చేశాయ‌న్నారు. ఈ విప‌త్తుల నేప‌థ్యంగా స‌హాయక చ‌ర్య‌ల్లో వారికి ప్ర‌ధాని మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.విప‌త్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. తుపానుకు ప్ర‌భావిత‌మైన అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఈ సంక్ష‌భ స‌మ‌యంలో ఎంతో స‌హ‌నంతో , క్ర‌మశిక్ష‌ణ‌తో ధైర్యాన్ని చూపించిన తీరును కొనియాడారు. ఈ విప‌త్తును ఎదుర్కోవ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, స్థానిక సంస్థ‌లు అన్నీ క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌న్నారు. మోదీ ఈ కార్య‌క్ర‌మంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ న‌డుపుతున్న దినేష్ ఉపాధ్యాయ్ తో ముచ్చ‌రించారు. యూపీలోని జౌన్‌పూర్ నివాసి ఉపాధ్యాయ్ ముచ్చ‌టిస్తూ త‌న జీవితంలో ఇలాంటి సేవ చేసే అవకాశం క‌లినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. కాగా ఇప్పుడు సంక్షోభ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో వైమానిక ద‌ళం కూడా ప్రధాన పాత్ర‌పోషించింది.మ‌న్ కీబాత్ కార్య‌క్ర‌మంలో ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌ధాని మోదీతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌ల‌కు స‌హాయ ప‌డ‌ట‌మ‌నేది త‌మ‌కు ద‌క్కిన గొప్ప వ‌రం అన్నారు. అనంత‌రం మోదీ ముచ్చ‌టిస్తూ త‌మ ప్రభుత్వం ఏడు సంవత్స‌రాలు పూర్తి చేసుకున్న‌ద‌ని అన్నారు. కొన్నేళ్లుగా దేశం స‌బ్ కాసాథ్‌, స‌బ్ కావికాస్‌, స‌బ్ కా-విశ్వాస్ అనే మంత్రంతో న‌డుస్తున్న‌ద‌న్నారు. గ‌డిచిన ఈ ఏడు సంవ‌త్స‌రాల‌లో సాధించిన విజ‌యాలు దేశానివ‌ని, దేశ ప్ర‌జ‌ల‌వ‌ని మోదీ పేర్కొన్నారు. నాదేశం ప్ర‌స్తుతం స్వీయ సంక‌ల్పంతోనే ముందు కు న‌డుస్తుంద‌న్నారు. దేశంపై ఇత‌ర దేశాల ఆలోచ‌న‌లు, ఒత్తిడిలు లేకుండా ముందుకు సాగుతున్నందుకు మ‌న‌మంద‌రం గ‌ర్వ‌ప‌డాల‌న్నారు. జాతీయ భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల‌పై భార‌త్ రాజీప‌డ‌బోద‌ని, మ‌న ‌త్రివిధ ద‌ళాల బ‌లం పెరిగింద‌ని, ఈ కార‌ణంగానే దేశం స‌రైన మార్గంలో ఉంది భావిస్తున్నామ‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *