ఐపీఎల్ సీజ‌న్ కోసం మ‌నీ ఆట‌గాళ్ల వేలం…

ముంబై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజ‌న్ కోసం మినీ ఆట‌గాళ్ల వేలం ఫిబ్ర‌వ‌రి 18న చెన్నైలో జ‌రుగుతుంద‌ని ఐపీఎల్ బుధ‌వారం ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జ‌రిగే వేదిక‌, తేదీలను బీసీసీఐ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ సంవ‌త్స‌రం సీజ‌న్ ఏప్రీల్ -మే నెలల్లో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. 2020 ఎడిష‌న్ పూర్తిగా యూఏఈలోనే జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 20తోనే ఐపీఎల్ ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ గ‌డువు ముగిసిపోగా ఆయా ఫ్రాంఛైజీలు ప‌లువురు ఆట‌గాళ్ల‌ను కూడా వ‌దులుకున్నాయి. జ‌ట్ల మ‌ధ్య ప్లేయ‌ర్ల ట్రేడింగ్ విండో ఫిబ్ర‌వ‌రి4 న ముగియ‌నుంది. 139 మంది ఆట‌గాళ్ల‌ను ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోగా 57 మందిని వేలంలోకి విడిచిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *