ప‌వ‌న్ కులాల‌ను టార్గెట్ చేసే విధంగా వ్యాఖ్య‌లు…

ఏపీలో తిరుప‌తి ఉప ఎన్నిక‌లు కూడా చాలా కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. జ‌న‌సేన అధినేత వ‌ప‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం కులాల‌ను టార్గెట్ చేసే విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు చేశారు. ఒక సామాజిక వ‌ర్గం ఐదేళ్లు అధికారం లో లేక‌పోతే బాధ‌ప‌డుతుంది,అంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపుతున్నాయి. వాస్త‌వానికి అధికారి వైసీపీ ముందు నుంచి కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ వ‌స్తున్న‌ది. ఈ త‌రుణంలో వ‌ప‌న్‌స్టార్ కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ప‌రోక్షంగా టార్గెట్ చేసి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. వాస్త‌వానికి తిరుప‌తిలో జ‌న‌సేన పార్టీకి ద‌ళిత సామాజిక వ‌ర్గంతో పాటు కాపు సామాజిక వ‌ర్గం కూడా ఎక్కువ‌గా బ‌లంగా ఉంటుంది. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇబ్బందిప‌డుతున్నారు. దీనికి ప్ర‌స్తుతం కాపు సామాజిక వ‌ర్గంలో కొంద‌రికి ఎక్కువ‌గా క‌మ్మ సామాజిక వ‌ర్గం పై కోపం ఉంటుంది. దీనికి ఇప్పుడు దీనిని భార‌తీయ జ‌న‌తా పార్టీకి అనుకూలంగా మార్చేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తుంది. మ‌రి ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత‌వ‌ర‌కు విజ‌యం సాధిస్తారు. ఏంటి అనేది చూడాలి. బీజేపీ అభ్య‌ర్థి కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌యంలో చాలా ఆశ‌లు పెట్టుకొని ముందుకు వెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *