ఏసు క్రీస్తు బోధ‌న‌ల సారంశాన్ని మాన‌వాళి ….

అమ‌రావ‌తి: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏసు క్రీస్తు బోధ‌న‌ల సారంశాన్ని మాన‌వాళి గ్ర‌హించాల‌న్నారు. పాపుల్ని ద్వేషించొద్ద‌ని.. క్షమించ‌మ‌ని చెప్పిన ప్రేమ‌మూర్తి ఏసు క్రీస్తు అంటూ త‌న‌ప్ర‌క‌ట‌న‌లో ప‌వ‌న్ వివ‌రించారు. దైవ కుమారునికి శిలువ వేసిన స‌మ‌యాన్నే గుడ్‌ఫ్రైడేగా క్రైస్త‌వ సోద‌రులు నిర్వ‌హించుకుంటున్నారని, స‌మ‌స్త‌మాన‌వాళి ఏసు క్రీస్తు బోధ‌న‌ల సారాన్ని గ్ర‌హించ‌డం అవ‌స‌ర‌మ‌న్నారు. శిలువ వేసిన స‌మ‌యంలో క్రీస్తు చెప్పిన ఏడు అమ‌ర వాక్యాల‌ని గుర్తు చేసుకోవాల‌న్నారు. నిరంత‌రం పొరుగువారికి ప్రేమ‌ను పంచుతూ, క్ష‌మా గుణంతో జీవించాల‌న్న క్రీస్తు జీవ‌న ప్ర‌స్థానాన్ని గుడ్‌ఫ్రైడే నేప‌థ్యంలో స్మరించుకోవాల‌ని వ‌ప‌న్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *