స్టీల్‌ప్లాంట్ స‌మ‌స్య‌లు అసెంబ్లీలో తీర్మానం చేయాలి….

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ సంగ‌తిలో వెన‌క్కిత‌గ్గేది లేదంటూ కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయ‌డంతో ….త‌మ పోరాటారాన్ని మ‌రింత గ‌ట్టి పోరాటం చేస్తున్నారు కార్మికులు. అటు అధికార పార్టీతో స‌హా ప్ర‌తిప‌క్షాలు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్య‌మానికి మ‌ద్ధ‌తు తెలిపాయి. ఈ సంద‌ర్భంలో స్టీల్ ప్లాంట్ ఉద్య‌మంపై స్పందించారు. ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేయాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళ‌న‌ల మ‌ధ్య ఆ కార్పొరేష‌న్ ను గెలుచుకున్న వైసీపీకి22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని తెలిపారు. మ‌రింత బాధ్య‌త‌తో వైసీపీ… స్టీల్ ప్లాంట్ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని కోరారు ప‌వ‌న్‌. ఈ మేర‌కు ఆయ‌న ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. అసెంబ్లీ స‌మావేశాలు ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాల‌ని… అక్క‌డ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు -భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల ఇబ్బందుల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు.22 మంది ఎంపీలున్న వైసీపీనే.. ఢిల్లీలో ఈ స‌మ‌స్య ను ప‌రిష్క‌రించాల‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *