ప‌రీక్షితుడు వృత్తాంతం ముగింపు..

శృంగి శాపం తెలుసుకున్న ప‌రీక్షితుడు కృంగిపోయాడు. చేసిన త‌ప్పుకు ఫ‌లితం అనుభ‌వించక త‌ప్ప‌దు క‌దా.. అనుకున్నాడు. త‌న పుత్రుడైన జ‌న‌మేజ‌యుడికి రాజ్య‌భారం అప్ప‌గించాడు. పండితుల‌కు, బ్ర‌హ్మ‌ణుల‌కు, అన్న‌, వ‌స్త్ర‌,భూ,గో, స్వ‌ర్ణ‌, దానాల‌ను చేసాడు. అయినా తృప్తి క‌లుగ‌లేదు. గంగాన‌దీ తీరం చేరి ఆశ్ర‌మ‌వాసి అయ్యాడు. ఆ స‌మ‌యంలో వ్యాస‌నందుడైన శుక యోగీంద్రుడు ప‌రీక్షితుడిని ద‌ర్శించాడు. ఆయ‌న‌కు సాద‌రంగా ఆహ్వానించి అర్ఘ్య‌మిచ్చి… ఆస‌న మిచ్చిపాదాల‌కు న‌మ‌స్క‌రించి.. మ‌హాత్మా .. నా మ‌ర‌ణం ఎప్పుడో నాకు తెలిసి పోయింది. క‌నుక నాకు ముక్తి మార్గం చూపించండి… అంటూ శుక‌మ‌హార్షిని వేడుకున్నాడు. శుక యోగేంద్రుడు ప‌రీక్షితుడికి ధైర్యం చెబుతూ…నాయ‌నా…చింతించ‌కు, ముని కుమారుని శాపం ఫ‌లించ‌టానికి ఏడు రోజుల గ‌డుపు ఉంది. ఈ ఏడు దినాల‌లో స‌ర్వ‌పాపాల‌ను హ‌రించి ముక్తిని ప్ర‌సాదించే పుణ్య గాథ అయిన భాగ‌వ‌త క‌థ‌ల‌ను నీకు వినిపిస్తాను.ఈస‌క‌ల సృష్టిలో స‌ర్వ‌పాపాల‌ను హ‌రించ గ‌లిగేది శ్రీ‌మ‌న్నా రాయ‌ణుని నామం ఒక్క‌టే….. అంత‌కు మించిన ఉత్తమ మార్గం లేదు. పూర్వం ఖాట్వాంగుడ‌నే మ‌హారాజుదేవ‌- అసుర సంగ్రామంలో దేవ‌త‌ల‌కు సాయంగా యుద్ధానికి పోయి తిరిగి వ‌చ్చాడు. అప్ప‌టికి అత‌డి వంశంలో చాలా త‌రాల‌వారు గ‌తించిపోయారు. అత‌డిని ఎగ‌రిగిన వారు ఒక్క‌రు కూడా క‌న్పించ‌లేదు.ఖాట్వాంగునికి ఏం చేయ్యాలో అర్థంకాక ఒక ఏకాంత ప్ర‌దేశంలో కూర్చుని దేవ‌త‌ల‌ను ప్రార్థించాడు.దేవ‌త‌లారా…నేను మీ కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇక్క‌డ నా వంశంలో ఎన్నో త‌రాలు గ‌డిచి పోయాయి..నావంశంలోనే న‌న్ను గుర్తించేవారు క‌రువ‌య్యారు.ప్ర‌స్తుతం నేనే చేయాలి…. నాఆయువు ఇంకా ఎంత కాల‌ముందో చెప్పండి… దానిని బ‌ట్టి కొంత‌కాలం రాజ్య‌పాల‌న చేసిత‌ప‌స్సుకు పోవ‌టమా….రాజ్య‌కాంక్ష వ‌దిలేసి త‌పస్సుకు పోవ‌టామా…నిర్ణ‌యించు కుంటాను..అన్నాడు. దేవ‌త‌లు ఖాట్వాంగుని ఆయుష్షును గుణించి… రాజా… నీవింకా కొన్ని ఘ‌డియ‌లే బ్ర‌తుకుతావు అని చెప్పారు. ఖాట్వాంగుడు చింతిస్తూ అయ్యో త‌పస్సు చేసి మోక్షం పొంద‌టానికి కూడా స‌మ‌యంలేదుక‌దా….అని చింతించగా దేవ‌త‌లు అత‌డికి నారాయ‌ణ మంత్రం ఉప‌దేశించి స్మ‌రించ‌మ‌నున్నారు.
ఆ మంత్రాన్ని కొన్ని ఘ‌డియ‌ల‌పాటు దీక్ష‌గా…. ఏకాగ్ర‌త‌తో స్మ‌రించి ఖాట్వాంగుడు మోక్షం పొందాడు. అని ఖాట్వాంగుని క‌థ‌ను ప‌రీక్షితుడికి చెప్పి… క‌నుక రాజా ఆ నారాయ‌ణుడి స్మ‌ర‌ణ శ‌క్తివంత‌మైన భాగ‌వ‌త క‌థ‌ల‌ను నీకు వినిపిస్తాను. ఏవిధ‌మైన చింతా లేకుండా నిర్మ‌ల‌మైన మ‌న‌స్సుతో ఈ క‌థ‌ల‌ను విను, నీకు మోక్షం క‌లుగుతుంది…. అంటూ శుక మ‌హ‌ర్షి భాగ‌వ‌త క‌థ‌ల‌ను ప్రారంభించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *