దేవాల‌యాల‌పై వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ…

తిరుప‌తిః ఏపీలో ఆలయాల‌పై జ‌రుగుతున్న దాడుల‌తో ప్ర‌జ‌లు త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ని టీటీడీ పాల‌క‌మండ‌లి మాజీ స‌భ్యుడు ఓవీ ర‌మ‌ణ అన్నారు. ఆల‌యాల‌పై దాడుల‌కు సీఎం జ‌గ‌న్‌ను బాధ్యుడిని చేయ‌డం త‌గ‌ద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు స్వామీజీలు అంతా క‌లిసి జ‌గ‌న్ సీఎం కాకూడ‌ద‌ని ఓ స‌మావేశంలో తీర్మానించారని చెప్పారు. త‌మ అవ‌స‌రాల కోసం స్వామీజీలు కొన్ని పార్టీల‌కు వ‌త్తాసుప‌ల‌క‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. ఏడుకొండ‌ల‌… రెండు కొండ‌లు .. భ‌గ‌వ‌ద్గీత‌… బైబిళ్ల‌పై బీజేపీ నేత‌లు మాట్లాడ‌డం విచార‌క‌ర‌మ‌ని చెప్పారు. బీజేపీ అధికారం లో ఉన్న నాగాలండ్ ప్ర‌భుత్వం క్రైస్త‌వుల‌ను ఉచితంగా జెరూస‌లం పంప‌డం ఎలాంటి సంకేత‌మ‌ని ప్ర‌శ్నించారు. దేవుళ్ల‌పై వివాదాలు సృష్టించడం త‌ప్ప బీజేపీ చేసిన అభివృద్ది శూన్య‌మ‌ని మండిప‌డ్డారు. ఏ పార్టీ కూడా ఆల‌యాల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌ద‌న్నారు. కానీ ఈఅంశంపై బీజేపీ రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని చూస్తోంద‌ని ఓవీ ర‌మ‌ణ మండిప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *