సెర్బియ‌న్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఓట‌మి ఎర‌గ‌ని రికార్డు…..

మెల్‌బోర్న్‌: నొవాక్‌కు ఇది 9వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావ‌డం విశేషం. ఇంత‌కుముందు మ‌రే ప్లేయ‌ర్ ఇన్ని స్లారు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ నెగ్గ‌లేదు. కానీ సెర్బియ‌న్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఓపెన్ చాంపియ‌న్ గా నిలిచాడు.అత‌ని కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీల‌ను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైన‌ల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ జొకోవిచ్‌కు ఓట‌మి ఎర‌గ‌ని రికార్డు ఉండ‌టం విశేషం. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లోనూ జొకోవిచ్ పూర్తి ఆధిప‌త్యం క‌న‌బ‌రిచాడు. తొలి సెట్‌లోనే మెద్వెదెవ్ నుంచి కాస్త పోటీ ఎద‌రైనా.. త‌రువాతి రెండు సెట్ల‌ను నొవాక్ సునాయాసంగా గెలిచాడు.ఈరోజు జ‌రిగిన ఫైన‌ల్లో మెద్వెదెవ్‌పై7-5,6-2,6-2 తేడాతో వ‌రుస సెట్ల‌తో గెలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *