ప్ర‌పంచ కూడా మ‌న‌ల్ని గుర్తించింద‌న్నారు….

న్యూఢిల్లీ: ఇండియా అభివృద్ధి మూలం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈ రోజు నీతి ఆయోగ్ ఆర‌వ పాల‌న మండ‌లి స‌మావేశంలో పాల్గొన్న మోదీ… వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌లు రాష్ట్రాల సీఎంల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. పోటీతత్వాన్ని, స‌హ‌కార స‌మాఖ్య విధానాన్ని రాష్ట్రాల మ‌ధ్యే కాకుండా.. జిల్లా స్థాయిలోనూ బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా సామాన్య‌ప్ర‌జ‌లు చాలా అవ‌స్థ‌లు ప‌డ్డారు. కోవిడ్ వేళ కేంద్ర ,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలా ప‌నిచేశాయో చూశామ‌ని, ఈవిధానంలో దేశం స‌క్సెస్ అయ్యింద‌ని , ప్ర‌పంచ కూడా మ‌న‌ల్ని గుర్తించింద‌న్నారు. దేశ స్వాత‌త్య్రానికి 75 స‌వ‌త్స‌రాలు నిండాయ‌ని ,నీతిఆయోగ్ పాల‌న మండ‌లి స‌మావేశం ఈ సంద‌ర్బంగా మ‌రింత ప్రాముఖ్య‌త సంత‌రించుకున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.
కొన్ని సంవ‌త్సరాల నుంచి ఉచితంగా బ్యాంకు అకౌంట్లు క‌ల్పిస్తున్నామ‌ని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పెరిగింద‌ని, ఆరోగ్య స‌దుపాయాలు కూడా పెరిగాయ‌న్నారు. పేద‌ల కోసం ఉచిత విద్యుత్తు క‌నెక్ష‌న్లు, ఫ్రీ గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇస్తున్నామ‌న్నారు. ఈ స‌దుపాయాలు పేద‌ల జీవితాల్లో పెను మార్పులు తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *