క‌రోనా టీకా తొలి డోసు తీసుకున్న నిర్మ‌లా సీతారామ‌న్‌

న్యూఢిల్లీ: గ‌త ఏడాది నుంచి ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్న మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డానికి ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా టీకా వేసుకోవాల‌ని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ కరోనా టీకా తొలి డోస్ తీసుకున్న‌ట్లు ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా టీకా వేసి న‌ర్సు ర‌మ్య‌కు కేంద్ర ఆర్థిక మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదివ‌ర‌కే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ కూడా కరోనా టీకా మొద‌టి డోస్ తీసుకున్నారు. మ‌రో వైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కూడా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కోవిడ్‌-19 నివార‌ణ‌కు కేంద్ర‌, రాష్ట్ర‌త్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు కొంత మేర‌కు త‌గ్గాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *