సామాన్య ప్ర‌జ‌ల‌కు ఊర‌ట క‌లిగించేలా కేంద్ర ప్ర‌భుత్వం …

హైద‌రాబాద్‌: పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గిస్తూ… కేంద్ర బుధవారం నిర్ణ‌యం తీసుకుంది. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వ‌డ్డీరేటుపై 0.7 శాతం, నేష‌న‌ల్ సెవింగ్స్ స‌ర్టిఫికేట్ వ‌డ్డీరేటుపై 0.9 శాతం, సేవింగ్స్ డిపాజిట్ పై 0.5 శాతం త‌గ్గిస్తున్న‌ట్టు పేర్కొంది. వ‌డ్డీరేట్ల‌ను 1.1 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిన్న‌జారీ చేసిన ఉత్వ‌ర్వుల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. 2020-21 చివ‌రి త్రైమాసికం ప్ర‌కార‌మే వ‌డ్డీరేట్లు ఉంటాయ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. సామాన్య ప్ర‌జ‌ల‌కు ఊర‌ట క‌లిగించేలా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు వ‌డ్డీరేట్లు య‌థాతథంగా ఉంటాయ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *