ఆ ప‌థ‌కం ధ‌న‌వంతుల‌కు ఉప‌యోగ‌ప‌డేది కాద‌ని చెప్పారు

న్యూఢిల్లి: క‌రోనామ‌హ‌మ్మారి సామాన్య ప్ర‌జ‌ల‌కు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది.క‌రోనా విప‌త్తు వ‌లన సంక్షోభంలోనూ ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన అవ‌కాశాల‌ను వ‌దులుకోలేద‌ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ‌న్ తెలిపారు. బ‌డ్జెట్ పై చ‌ర్చ అనంత‌రం శ‌నివారం లోక్‌స‌భ‌కు స‌మాధానం ఇచ్చిన నిర్మ‌లాసీతారామ‌న్‌… కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే సంస్క‌ర‌ణ‌ల‌కు క‌రోనా దుష్ట‌శ‌క్తి నిరోధించ‌లేక‌పోయింద‌ని, దేశ దీర్ఘ‌కాలిక అభివృద్ధికి సంస్క‌ర‌ణ‌లు త‌ప్ప‌నిస‌రని చెప్పారు. తాజా బ‌డ్జెట్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అపార‌మైన అనుభువానికి, ప‌రిపాల‌నా సామ‌ర్థ్యాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని నిర్మలాసీతారామ‌న్ పేర్కొన్నారు. బ‌డ్జెట్లో ఆరోగ్య‌రంగానికి పెద్ద‌పీట వేశామ‌ని, దేశ ప్ర‌జ‌ల సంక్షేమానికి ఇది ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆమె తెలిపారు. కొంద‌రు ప‌నిగ‌ట్టుకునిబ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారని, ధ‌నికుల మేలుచేసేలా బ‌డ్జెట్ ఉందంటున్నార‌ని ఆర్థిక మంత్రి విమ‌ర్శించారు. బ‌డ్జెట్‌పీఎం స్వనిధి యోజ‌న‌కు భారీగా నిధులు కేటాయించామ‌ని, ఆప‌థ‌కం ధ‌న‌వంతుల‌కు ఉప‌యోగ‌ప‌డేది కాద‌ని చెప్పారు.రెవెన్యూ విభాగానికి2013-14 బ‌డ్జెట్‌లో రూ.1,16,931 కోట్లు కేటాయించ‌గా ప్ర‌స్తుతం అది రూ.1,2,09,319 కోట్లు కేటాయించామ‌ని, పింఛ‌న్‌ల‌కోసం 2013-14 బ‌డ్జెట్‌లో 44,500 కోట్లు కేటాయించ‌గా ప్ర‌స్తుతం అది రూ. 1,33,825 కోట్ల‌కు పెరిగింద‌ని నిర్మ‌లాసీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆప్తుల కోసం బ‌డ్జెట్ అన‌డంలో అర్థం లేద‌ని, అస‌లు ఆప్తులు ఎక్క‌డున్నార‌ని,
బ‌హుశా ప్ర‌జ‌ల తిర‌స్కారానికి గురైన పార్టీ నీడ‌లో ఉండి ఉండొవ‌చ్చ‌ని ఆర్థిక మంత్రి ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *