ఏపీలో రాజ‌కీయం మ‌రోసారి వేడెక్కింది…

అమ‌రావ‌తి:ఏపీలో అధికార ప‌క్షానికి , ప్ర‌తిప‌క్షానికి మాట్టాల‌ యుద్ధం రోజు రోజు పెట్రేగుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగం. మ‌రో మంత్రిపై ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు నోటీసులు కూడా జారీ చేశారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, జోగి ర‌మేష్ కు నోటీసులిచ్చి మీడియాతో మాట్లాడ‌వ‌ద్దంటూ ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్.. కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రేష‌న్ స‌రుకులు డోర్ డెలివ‌రీ అంశంపై ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కొడాలి నాని వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలించామ‌ని .ఆ వ్యాఖ్య‌లు ఎస్ఈసీని కించ‌ప‌రిచేవీగా ఉన్నాయ‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు సాయంత్రం 5 గంట‌ల లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. వ్య‌క్తిగతంగా గాని, స‌హాయ‌కుల చేతగాని వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో పాటు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న కూడా చేయాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. కొడాలి
ఏమ‌న్నారంటే…
తాడేప‌ల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని… ఏపీ రాష్ట్రంలో రేష‌న్ స‌రుకుల డోర్ డెలివ‌రీని
అడ్డుకునేందుకు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ,చంద్ర‌బాబు క‌లిసి వ‌చ్చినా అడ్డుకోలేర‌న్నారు. వీరంతా జ‌గ‌న్నాథ‌ర‌థ చ‌క్రాల కింద న‌లిగిపోవ‌డం ఖాయ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబును, నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌కు పిచ్చి ప‌ట్టింద‌ని…వారిని ప‌రీక్షంచి ఎర్ర‌గ‌డ్డ పిచ్చాసుప‌త్రిలో చెర్పింది ట్రీట్ మెంట్ ఇవ్వాల‌ని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *