ఏపీలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం వ‌ర్సెస్ ప్ర‌భుత్వం….

అమ‌రావ‌తి: ఏపీలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం వ‌ర్సెస్ ప్ర‌భుత్వంగా ప‌రిణామాలు చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. గంట‌కు గంట‌కు .. నిమిష నిమిషానికి అన్న‌ట్టుగా రెండింటి మ‌ధ్య వ్య‌వ‌హారాలు సాగుతున్నాయి. వ్యాక్సినేష‌న్ నేప‌థ్యంలో స్థానికి ఎన్నిక‌ల‌కు నిలుపుద చేయాల‌ని కోరుతూ సుప్రీం కోర్టును జ‌గ‌న్ స‌ర్కార్ ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజ‌రాత్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ఆదివారం షెడ్యూల్ విడుద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 21,28 తేదీల‌లో.. రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు గుజ‌రాత్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ ప్ర‌క‌టించింది. దీంతో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లులోకి వ‌చ్చింది. ఇదిలా ఉంటే, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిలుపుద‌ల‌కు కోరుతూ ఏపీ స‌ర్కార్ వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో సోమ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. దీంతోరేపు ఏం జ‌ర‌గ‌బోతుందోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *