ప్ర‌యాణికుల రాక పై తాత్కాలిక నిషేదం- న్యూజిలాండ్‌

వెల్లింగ్ట‌న్‌: ఇండియాలో కొవిడ్ మ‌హ‌మ్మారి విల‌య‌తాడ‌వం చేస్తున్న సంద‌ర్భంగా న్యూజిలాండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇండియా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ( ఆ దేశ పౌరుల‌తో స‌హా) త‌మ దేశంలోకి ప్ర‌వేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్‌11 నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. భార‌త్ నుంచి ప్ర‌యాణికులెవ‌రూ న్యూజిలాండ్‌లోకి రాకుండా ప్ర‌వేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఏప్రిల్‌11 సాయంత్రం 4 గంట‌ల నుంచి ఏప్రిల్ 28 వ‌ర‌కు మేం నిషేధం అమ‌ల్లో ఉంటుంది. ప్రయాణికుల రాక‌పై తాత్కాళిక నిషేధం వ‌ల్ల ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను మేం అర్థం చేసుకోగ‌లం. కానీ, వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకే ఈనిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. అని జెసిండా వివరించారు. అవ‌స‌ర‌మైతే నిషేధాన్ని మ‌రింత కాలం పొడ‌గించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ స‌రిహ‌ద్దుల్లో ప‌నిచేసే సిబ్బందిలో ఓ వ్య‌క్తికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ కావ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. అంతేగాక‌, ఈ మ‌ధ్య‌కాలంలో విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వ‌చ్చిన ప్ర‌యాణికుల‌కు స‌రిహ‌ద్దులో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా… అందులో 23 మందికి కొవిడ్ సోకిన‌ట్లు తేలింది. కాగా…వీరిలో 17మంది ఇండియా నుంచి వ‌చ్చిన‌వారే కావ‌డంతో కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలో భాగంగా స‌రిహ‌ద్దుల్లోనే వైర‌స్‌ను అడ్గుకునేలా న్యూజిలాండ్ క‌ఠిన‌చ‌ర్య‌లు చేప‌డుతోంది. గ‌త 40 రోజులుగా అక్క‌డ ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు న‌మోదు కాలేదు. ఇదిలా ఉండ‌గా… ఇండియాలో గ‌త కొద్ది రోజులుగా కొవిడ్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజువారీ తాజా కేసుల్లో గ‌ణ‌నీయ వృద్ధి ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *