హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం..

హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు మందుబాబులకు షాకింగ్ న్యూస్. న్యూ ఈయర్ వేడుకల వేళ మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నేటి నుంచి సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను మొదలుపెట్టనున్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నగరంలో కొన్ని నెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో నేటి నుంచి ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ తెలిపారు. ఇక, ట్రాఫిక్ పోలీసులు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *