మందు పంపిణీపై ఉత్కంఠ- ర‌హ‌స్య ప్రాంతానికి ఆనంద‌య్య

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కు మందు పంపిణీ చేసిన నెల్లూరు కృష్ణ‌ప‌ట్న వాసి అయిన ఆయుర్వేద వైద్యాని నేడు తెల్ల‌వారుజామున ప్ర‌త్యేక పోలీసు బందోబ‌స్తుతో ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించారు. మందుపై సోమ‌వారం నివేదిక వ‌చ్చేవర‌కు ఆనంద‌య్య‌ను ర‌హ‌స్య ప్రాంతంలోనే ఉంచ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈనెల‌21 ఆయ‌న మందు పంపిణీ నిలిచిపోయిన సంగ‌తితెలిసిందే. నెల్లూరు , ముత్తుకూరు నుండి కృష్ణ‌ప‌ట్నం వ‌చ్చేర‌హ‌దారుల్లో పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇత‌ర ప్రాంతాల నుండి వ‌స్తున్న జ‌నం కృష్ణ‌ప‌ట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రిస్తున్నారు. ఆనంద‌య్య మందు పంపిణీపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. కృష్ణ‌ప‌ట్నంలో ఇప్ప‌టికే విధించిన 144 సెక్ష‌న్ కొన‌సాగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *