ఆనంద‌య్య చుట్టూ పోలీసు వ‌ల‌యం….

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం వాసి అయిన ఆనంద‌య్య అనే ఆయుర్వేద వైద్యుని గురించి సంచ‌ల‌నం అయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మందు సంగ‌తిలో ఏపీ స‌ర్కారు వైఖ‌రిని అంద‌రూ త‌ప్పుప‌డుతున్నారు.ప్ర‌స్తుతం హైకోర్టు లో కూడా దీనికి సంబంధించి కేసు విచార‌ణ న‌డుస్తుంది. ఆనంద‌య్య కూడా దీనికి సంబంధించి పిటీష‌న్ దాఖ‌లు చేసారు. ఇక ఇదిలా ఉంటే ఈ మందుని అధికార‌పార్టీ నేత‌లు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారు. అనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కృష్ణ‌ప‌ట్నం గోపాల‌పురంలోనికేపీఎస్ఎస్పీ ఎల్ అకాడ‌మీలోనే బొనిగి ఆనంద‌య్య ఉన్నారు. ఆనంద‌య్య చుట్టూ పోలీసు వ‌ల‌యం.ఆనంద‌య్య‌ను ర‌హ‌స్య ప్రాంతంలో ఉంచిన పోలీసులు. ప్ర‌తి దినం బ‌క్కెట్ల కొద్ది మందుతయారు చేయించి మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకువేల్తున్నారు.ఆనంద‌య్య‌ని వంట మాస్టారుగా చేశార‌ని,జైళ్లో ఖైదీకి ఇచ్చే స్వేచ్చ కూడా ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఆనంద‌య్య మందు పంపిణీ కోసం జ‌నం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *