ఆనంద‌య్య మందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్….

అమ‌రావ‌తి: ఏపీరాష్ట్రంలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆస‌క్తిక విష‌యం నెల్లూరు జిల్లా వాసీ అయిన ఆయుర్వేద వైదున్ని మందుకు రాష్ట్రం ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంద‌ర్భంలో ఆనందయ్య ఆనందం వ్య‌క్తం చేశారు.ఆయ‌న ఇంటి వ‌ద్ద సంద‌డి నెల‌కొంది. ఇప్పుడు ఆనందయ్య కృష్ణ‌పట్నం సెక్యూరిటీ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అకాడ‌మీలోనే ఉన్నారు. ఇప్ప‌టికైనా ఆనంద‌య్య‌కు పోలీసులు విముక్తి క‌లిగిస్తార‌ని గ్రామ‌స్తులు, కుటుంబ‌స‌భ్యులు భావిస్తున్నారు. నేడు సాయంత్రానికి ఆనంద‌య్య ఇంటికి చేరుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఈ మందుకు ఏపీ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కొవిడ్ మ‌హ‌మ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనంద‌య్య ఇస్తున్న మందుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది. సీసీఆర్ ఏఎస్ నివేదిక ప్ర‌కారం ఆనంద‌య్య ఇచ్చే పి, ఎల్‌, ఎఫ్ మందుల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం చెప్తోంది. అలాగే కె అనే మందుకు క‌మిటీ ముందు చూపించ‌క‌పోవ‌డంతో దానికి కూడా అనుమ‌తి నిరాక‌రించింది. ఇక ఆనంద‌య్య ఇస్తున్న మిగిలిన మందుల వ‌ల్ల ఎలాంటి హాని లేద‌ని సీసీఆర్ఏఎస్ నివేదిక తేల్చ‌డంతో ప్ర‌భుత్వం వాటికి అనుమ‌తి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కంట్లో వేసే డ్రాప్స్ సంగ‌తిలో పూర్తి నివేదిక‌లు రావ‌డానికి మ‌రో 2-3 వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *