తెలంగాణ రాష్ట్రంలో ప‌రిశోధ‌నా కేంద్రం…

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రాన్నికి అనేక సంస్థ‌లు వ‌స్తున్నాయి తెలిసిన విష‌య‌మే.కానీ రాష్ట్రంలో మ‌రో బిగ్గెస్ట్ సంస్థ ఏర్పాటుకానుంది. జాతీయ అంటువ్యాధుల నియంత్ర‌ణ సంస్థ (ఎన్‌సీడీసీ) ప్రారంభానికి ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ మ‌ధ్య‌కాలంలో ఢిల్లీలో జ‌రిగిన జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) స‌మావేశాల్లో సాధ్య‌మైనంత వేగంగా ఎన్‌సీడీసీని తాత్కాలిక భ‌వ‌నంలో ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికోసం న‌ల్ల‌కుంట‌లోని కుష్టువ్యాధి నిర్మూల‌న శిక్ష‌ణ కేంద్రానికి సంబంధించిన భ‌వ‌నాల‌ను కేటాయించాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ‌యించింది. అయితే నాచారంలో ఎన్‌సీడీసీ శాశ్వ‌త భ‌వనాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం మూడెక‌రాల సంస్థ కేటాయించింది. ఇందులో రూ.25 కోట్ల‌తో అత్యాధునిక ప్ర‌యోగ‌శాల‌ను నిర్మించ‌నున్నారు. ఇది అందుబాటులోకి వ‌స్తే కరోనా స‌హా స్త్వెన్‌ప్లూ, బ‌ర్డ్‌ప్లూ ,జికా స‌హా మ‌రిన్ని వైర‌స్‌లు ,సూక్ష్మ క్రిముల‌పై ప‌రిశోద‌న‌లు నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *