దేశంలో భారీ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు త‌క్కువ వ‌డ్డీ రుణాలు

న్యూఢిల్లీ: వ‌చ్చే బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌…కొత్తగా ఓ నేష‌న‌ల్ బ్యాంక్ ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు ప్ర‌ముఖ మీడియా సంస్థ సీఎన్‌బీసీ వెల్ల‌డించింది. దేశంలో భారీ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు త‌క్కువ వ‌డ్డీ రుణాలు ఇవ్వ‌డానికే ప్ర‌త్యేకంగా ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పింది. అంతేకాదు ప్రావిడెంట్ ఫండ్‌, పెన్ష‌న్‌, ఇన్సూరెన్స్‌ఫండ్స్ కొంత మొత్తాన్ని క‌చ్చితంగా ఈ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాల‌న్న ష‌ర‌తు కూడా విధించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ బ్యాంక్ క్యాపిట‌ల్ రూ. ల‌క్ష కోట్లు కాగా.. మొద‌ట రూ. 20 వేల కోట్ల‌తో ప్రారంభించ‌నున్న‌ట్లు సీఎన్ బీసీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. ఈ బ్యాంక్‌ను ఓ ప్ర‌త్యేక చ‌ట్టం ద్వారా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కూడా ఆ రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ఇది రీప్లేస్ చేయ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *