రెండు వ్యాక్సిన్‌ల‌తో మాన‌వాళిని రక్షించేందుకు భార‌త్ సిద్ధం..

న్యూఢిల్లీః ఇప్పుడు మ‌నం ఇంట‌ర్‌నెట్ ద్వారా ప్ర‌పంచ న‌లుమూల‌ల‌తో సంబంధాలు క‌లిగి ఉన్నామ‌ని, అయినా మ‌న మ‌న‌సులు మాత్రం ఎల్ల‌ప్పుడూ మాతృదేశంతోనే సంబంధాలు క‌లిగి ఉంటాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు. 16న ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ఈ ఉద‌యం వ‌ర్చున‌ల్ విధానంలో ప్ర‌సంగించిన ప్ర‌ధాని… గ‌త కొన్ని ఏండ్లుగా నాన్ రెసిడెంట్ ఇండియ‌న్స్ (ఎన్ఆర్ ఐలు)ఇత‌ర దేశాల్లో మ‌రింత బ‌లోపేత‌మ‌య్యార‌ని తెలిపారు. దేశ‌లో క‌రోనా ప్ర‌భావం మొద‌లైన కొత్త‌లో భార‌త్ పీపీఈ కిట్‌ల‌ను ,మాస్కుల‌ను, వెంటిలేట‌ర్‌ల‌ను, టెస్టింగ్ కిట్‌ల‌ను బ‌య‌ట నుంచి దిగుమ‌తి చేసుకునేద‌ని, కానీ ప్ర‌స్తుతం ఆ విష‌యంలో మ‌న‌దేశం స్వావ‌లంబ‌న సాధించింద‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు. ఇప్పుడు మేడ్‌ ఇన్ ఇండియాలో భాగంగా స్వ‌దేశీ సంస్థ‌లు త‌యారు చేసిన రెండు వ్యాక్సిన్‌ల‌తో మాన‌వాళిని రక్షించేందుకు భార‌త్ సిద్ధంగా ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. భార‌త్ ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోనేందుకు గ‌ట్టిగా నిల‌బ‌డ‌టంతో ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా ఉగ్ర‌వాదాన్ని ఎద‌రించే శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను డ‌గ‌ట్టుకున్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. అదేవిధంగా దేశంలో అవినీతి అంతానికి భార‌త్ సాంకేతిక‌త‌ను నియోగిస్తున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం వివిధ సంక్షేమ ప‌థాకాల కింది ఇచ్చే ల‌క్ష‌ల‌, కోట్ల సొమ్ము ద‌ళారుల చేతికి వెళ్ల‌కుండా ప్ర‌స్తుతం నేరుగా ల‌బ్దిదారుల ఖాతాల్లో ప‌డుతున్న‌ద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *