అసోం అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంటుంది…

గౌహ‌తి: భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అసోంలో శాంతి, అభివృద్ధి సుస్థిరంగా ఉండాలంటే బీజేపీ కూట‌మికి ఓటు వేయాల‌న్నారు. ఇటీవ‌ల కాలంలో పాలించిన ప్ర‌భుత్వాలు అసోం గుర్తింపునే ధ్వంసం చేశాయ‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోదీ శ‌నివారం అసోంలో ప‌ర్య‌టించారు. త‌మ‌ది డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం అని మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల జీవితాల‌ను, ముఖ్యంగా మ‌హిళ‌ల జీవితాలు సౌక‌ర్య‌వంతం కావ‌డానికి త‌మ ప్ర‌భుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. స‌బ్ కాసాథ్‌, స‌బ్ కా వికాస్ అన్న నినాదంతో ఐదేళ్లూ ప‌నిచేశామ‌ని తెలిపారు. అసోం అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని హామి ఇచ్చారు. తాము అన్ని వ‌ర్గాల అభివృద్ధికి పాటుప‌డుతున్నామ‌ని, ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేడ‌యం లేద‌ని స్ప‌ష్టం చేశారు. స‌మాజంలో వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం,స‌మాజాన్ని కొన్ని విష‌యాల‌ను వ‌క్రీక‌రించి చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. స‌మాజంలో వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం, స‌మాజాన్ని విడ‌దీయం, ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేస్తే వారిని లౌకిక‌వాదులు అని అంటున్నార‌ని, అంద‌రి కోసం పాటుప‌డితే వారిని మ‌త‌త‌త్వ వాదులు అంటున్నార‌ని మండిప‌డ్డారు. అటు లౌకిక‌వాదం, ఇటు మ‌త‌త‌త్వం రెండూ దేశానికి పెద్ద ప్ర‌మాద‌మ‌ని మోదీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *