రైతు ప్ర‌తినిధులు ప్ర‌భుత్వానికి మ‌రోసారి విజ్ఞ‌ప్తి..

న్యూఢిల్లీః వివాదాస్ప‌ద సాగు చ‌ట్టాల‌పై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్ర‌తినిధుల మ‌ధ్య శుక్ర‌వారం జ‌రిగిన చ‌ర్చ‌లు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదు. ఈనెల 15న మ‌రోసారి స‌మావేశం కావాల‌ని మాత్రం నిర్ణ‌యించారు. విజ్ఞాన్ భ‌వ‌న్‌లో సుమార్ గంట‌సేపు చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ ఇరువ‌ర్గాలు త‌మ వాద‌న‌కే క‌ట్టుబ‌డ్డాయి. సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని రైతు ప్ర‌తినిధులు ప్ర‌భుత్వానికి మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. చ‌ట్టాల‌ను వెన‌క్కితీసుకుంటేనే తాము నిర‌స‌న‌ల‌కు స్వ‌స్తి చెప్పి ఇళ్ల‌కు వెళ్తామ‌ని చెప్పారు. మ‌రోవైపు, ప్ర‌భుత్వం కూడా త‌మ వైఖ‌రి మ‌రోమారు స్ప‌ష్టం చేసింది. వివాదాస్ప‌ద క్లాజుల‌కే చ‌ర్చ‌లు ప‌రిమితం చేద్దామ‌ని, చ‌ట్టాల‌ను పూర్తిగా వెన‌క్కితీసుకునేది లేద‌ని తెగేసి చెప్పింది. ఎనిమిదోరౌండు చ‌ర్చ‌ల్లో 41 మంది స‌భ్యుల రైతుల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌, రైల్వే మంత్రి పీయూష్ గోయెల్, వాణిజ్యశాఖ స‌హాయ మంత్రి సోమ్ ప్ర‌కాష్ ప్ర‌భుత్వం త‌రపున హాజ‌ర‌య్యారు. చ‌ర్చ‌ల్లో ప్ర‌భుత్వం త‌మ వాద‌న వినిపిస్తూ, వివిధ రాష్ట్రాల‌కు చెందిన రైతులు పెద్ద ఎత్తున రైతు సంస్క‌ర‌ణ చ‌ట్టాల‌ను స్వాగ‌తిస్తున్నార‌ని,యావ‌త్‌దేశ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకునే యూనియ‌న్లు ఆలోచించాల‌ని కోరింది. గంట‌సేపు స‌మావేశాంత‌రం త‌మ‌లో తాము సంప్ర‌దించుకున్న ముగ్గురు మంత్రులు స‌మావేశ‌హాలు నుంచి బ‌యట‌కు వెళ్లిపోయారు. ఇందులో ప్ర‌తిగా జీతేంగే యా మరేంగే నినాదాలున్న పేప‌ర్లు ప‌ట్టుకుని రైతుల నేత‌లు మౌనం పాటించారు. కాగా, చ‌ర్చ‌లు అసంపూర్తిగా ముగిసిన‌ప్ప‌టికీ జ‌న‌వ‌రి 15 జ‌రిగే త‌దుప‌రి చ‌ర్చ‌ల‌కు హాజ‌ర‌వుతాయ‌ని రైతుల నేతులు ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *