ఎర్ర‌కోట‌పై మూడు రంగుల జెండాకు తీవ్ర అవ‌మానం..

న్యూఢిల్లీ: రిప‌బ్లిక్ డే రోజు జాతీకి ప్ర‌తిక అయిన ఎర్ర‌కోట‌పై మువ్వ‌న్నెల జెండాకు తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆవేద‌న చెందారు. ఈ సంఘ‌ర్ష‌ణ‌తో దేశంమొత్తం ఒక్క‌సారి ఉల్కిప‌డింది. మ‌న్‌కీబాత్ కార్య‌క్రమంలో భాగంగా ఈ ఉద‌యం ఆలిండియా రేడియోలో ప్ర‌సంగించిన ప్ర‌ధాని ..జ‌న‌వ‌రి 26న రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీ, ఆస్ట్రేలియా తో భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్టు సిరీస్ విజ‌యం, క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ స‌త్తా, దేశంలో మ‌హిళాశ‌క్తి పురోగ‌తి త‌దిత‌ర అంశాపై మాట్లాడారు. ఈనెల క్రికెట్ సంబంధించి మ‌నం ఒక శుభ‌వార్త విన్నామ‌ని, ఆస్ట్రేలియా లో భారత క్రికెట్ జ‌ట్టు టెస్టు సిరీస్ గెలువ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. భార‌త క్రికెట్ జ‌ట్టు స‌మిష్టిగాగా హార్డ్‌వ‌ర్క్ చేయ‌డంవ‌ల్లే అదీ సాధ్య‌మైంద‌న్నారు. ఇప్పుడు ఔష‌ధాలు, టీకాల విష‌యంలో భార‌త్ స్వావ‌లంబ‌న సాధించింద‌ని, అందుకే వ్యాక్సినేష‌న్‌లో పొర‌గు దేశాల‌కు కూడా స‌హాయం చేయ‌గ‌లుతున్నామ‌ని ప్ర‌ధాని
పేర్కొన్నారు. దేశంలోని ర‌చ‌యిత‌లు, ముఖ్యంగా యువ ర‌చ‌యిత‌లు స్వాతంత్యం స‌మ‌ర‌యోధుల త్యాగాల గురించి రాయాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. స్వాతంత్యం సంగ్రామం సంద‌ర్భంగా యోధులు వారివారి ప్రాంతంలో చూపిన తెగువ‌, ప‌రాక్ర‌మాల గురించి పుస్త‌కాలు రాయాల‌ని ఆయ‌న సూచించారు. దేశం 75వ స్వాత్యంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకోబోతున్న నేప‌థ్యంలో స‌మ‌ర‌యోధుల గురించి మీరు చేసే ర‌చ‌న‌లే వారికి ఘ‌న‌మైన నివాళి అని ప్ర‌ధాని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో త‌మ స‌త్తా చాటుతున్నార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. కొన్ని రోజు క్రితం దేశానికి చెందిన న‌లుగురు మ‌హిళా పైలెట్లు అమెరికా నుంచి బెంగ‌ళూరుకు విమానాన్ని న‌డిపి225 ప్ర‌యాణికుల‌ను గ‌మ్యానికి చేర్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. దేశంలో మ‌హిళాశ‌క్తి పురోగ‌తి సాధిస్తుంద‌న‌డానికి ఇది ఒక నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *