దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై ప్ర‌ధాని మోదీ ఘాటు వ్యాఖ్య‌లు…

న్యూఢిల్లీః భార‌త రాజ్యాంగ రూప‌క‌ల్ప‌న‌కు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో నేష‌న‌ల్ యూత్ పార్ల‌మెంట్ ఫెస్టివ‌ల్ 2021 జ‌రుగుతుండ‌టం చాలా ఆనంద‌గా ఉన్న‌దాని ప్ర‌ధాని పేర్కొన్నారు. నేష‌న‌ల్ యూత్ పార్ల‌మెంట్ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారిని ఉద్దేశించి ప్ర‌ధాని ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌సంగించారు. తాము ఇటీవ‌ల తీసుకొచ్చిన నూత‌న జాతీయ విధానం 2020 జాతి అభివృద్ధి దిశ‌గా ప‌డిన కీల‌క ముంద‌డుగు అని ప్ర‌ధాని పేర్కొన్నారు. తాము దేశ యువ‌త‌కు మంచి అవ‌కాశాల‌ను క‌ల్పించే వ్య‌వ‌స్థ‌ను దేశంలో అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. అదేవిధంగా దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై ప్ర‌ధాని మోదీ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు దేశానికి ఒక స‌వాలుగా మారాయ‌ని, వాటిని స‌మూలంగా నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇంటిపేరును ఎక్కువ‌గా వాడుకునేవార‌ని, ఇప్ప‌టికీ దేశంలో వార‌స‌త్వ రాజకీయాలు పూర్తిగా తొల‌గిపోలేద‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *