జీ7కు రండి.. ప్ర‌ధాని మోదీకిఆహ్వానం-బ్రిట‌న్

ప్ర‌ధాని మోదీకి బ్రిట‌న్ ఆహ్వానం.. జీ7కు రండి…..
న్యూఢిల్లీ: ఈ సంవ‌త్స‌రం జూన్‌లో బ్రిట‌న్‌లో కార్న్‌వాల్ ప్రాంతంలో జ‌ర‌గ‌బోయే జీ7 స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని యునైటెడ్ కింగ్ డ‌మ్ ఆహ్వానించింది. ఇండియానే కాకుండా ఆస్ట్రేలియా, సౌత్ కొరియాల‌ను కూడా ఈ స‌ద‌స్సుకు ప్ర‌త్యేక అతిథులుగా ఆహ్వానించారు. ప్ర‌పంచంలోని7ప్ర‌జాస్వామ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌లైన యూకే, జ‌ర్మ‌నీ,కెనాడా,ఫ్రాన్స్‌, జ‌పాన్‌, ఇట‌లీ,యూఎస్ఏఈజీ7 దేశాలుగా ఉన్నాయి. జీ7 స‌ద‌స్సులో భాగంగా ఈ దేశాలు కరోనా వైర‌స్ మహ‌మ్మారి, ప‌ర్యావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు, సాంకేతిక‌ప‌ర‌మైన మార్పులు,శాస్త్రీయ ఆవిష్క‌ర‌ణ‌లు, స్వేచ్చా వాణిజ్యంపై చ‌ర్చించ‌నున్నాయి. రిప‌బ్లిక్ డే గెస్ట్‌గా వ‌స్తాన‌ని చెప్పి ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్న‌యూకే పీఎం బోరిస్ జ‌న్స‌న్‌…జీ7 స‌ద‌స్సు ముందు ఇండియాలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా యూకే ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *