అస్సాంలో మాల ప‌థ‌కానికి శంకుస్థాప‌న‌…

ఢిల్లీ: దేశంలో టీ ప్ర‌రిశ్ర‌మ‌పై చెడు ప్ర‌చారం చేసి. దేశ ప్ర‌తిష్ట‌ను భంగప‌రుస్తున్నారు, కొంద‌రు వ్య‌క్తులు విదేశాల నుంచి కుట్ర‌లు చేస్తున్నార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. అలాంటి కుట్ర‌లు చేస్తున్న వారికి దేశీయంగా మ‌ద్ధ‌తు ప‌లికే రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని మోదీ చెప్పారు. ఈ మేరకు మోదీ ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లా లో నిర్వ‌హించిన టీ ప‌రిశ్ర‌మ‌లోని ప‌నిచేసే కార్మికుల స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర ర‌హాదారుల అభివృద్ధి కోసం రూ.8వేల కోట్ల‌తో త‌ల‌పెట్టిన అసోం మాల ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేశారు. ఇప్ప‌టి రోజుల్లో దేశంలోని టీ ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకంగా బ‌య‌టి దేశాల నుంచి కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నారు. ఆ కుట్ర‌ల ద్వారా దేశ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారు. అందుకు సంబంధించిన స‌మాచారాన్ని ఈమ‌ధ్య‌కాలంలో కొన్ని నివేదిక‌లు బ‌య‌ట‌పెట్టాయి. ఆ కుట్ర‌దారుల‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్న రాజ‌కీయ పార్టీను ప్ర‌తి టీ తోట కార్మికుడు నిలదీయాల‌ని, అలాంటి వారికి టీ కార్మికులంతా దీటైన స‌మాధానం ఇవ్వాల‌ని నేను భావిస్తున్నా, అని మోదీ వెల్ల‌డించారు. స్థానికి భాష‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చేలా ప్ర‌తి రాష్ట్రంలో క‌నీసం ఓ వైద్య‌శాల‌, ఓ సాంకేతిక క‌ళాశాల నెల‌కొల్పాల‌నేది నా క‌ల‌. వైద్యులు మాతృభాష‌లో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన‌ప్పుడే వారి ఇబ్బందులు అర్థం చేసుకోగ‌లుగుతారు. ఫ‌లితంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సేవ‌లు మెరుగ‌వుతాయి. అసోంలో గ‌త ప‌దేళ్ల‌లో క‌నీవినీ ఎరుగ‌ని విధంగా అభివృద్ది జరిగింది. వైద్యారోగ్య‌, మౌలీక స‌దుపాయాలు మెరుగయ్యాయి. ప్ర‌స్తుతం ప్రారంభించిన అసోం మాల ప‌థ‌కం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఇంకా మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయి. అని మోదీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *