ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సీఎం పాల‌న‌కు ప‌త‌నం ఖాయం…

అమ‌రావ‌తి: ఏపీలో రాష్ట్రంలో జ‌రిగిన అన్యాయ‌మే కాక చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించేందుకు రేణిగుంట విమ‌నాశ్ర‌యానికి వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని పోలీసులు అడ్డుకోవ‌డంపై ఈ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ మండిప‌డ్డారు. అధికారంలో ఉన్నామ‌ని ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మ్మ‌తంగా ఉన్న‌దని అడుగుతున్నాను.2019లో ప‌ల్నాడు వెళ్ల‌కుండా ఇంటి గేటుకి తాళ్లు క‌ట్టి అడ్డుప‌డ్డార‌ని..2020లో విశాఖ ఎయిర్‌పోర్ట్ నుండి బ‌య‌ట‌కు రాకుండా చుట్టుముట్టార‌ని….2021లో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో నిర్భంధించార‌ని గుర్తుచేశారు. దైర్యం ఉంటే మాతో త‌ల‌ప‌డ్డాలి కాని ఇలాంటి అరాచ‌కాలు ఇంకెన్నాళ్లు? అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష నేత ఇంటి గేటుకి క‌ట్టిన తాళ్లే నీ పాల‌న అంతానికి ఉరితాళ్లు. డెమోక్రసిని జ‌గ‌నోక్ర‌సీతో అప‌హాస్యం చేస్తూ ప్ర‌తిప‌క్ష నేత హ‌క్కులు హ‌రిస్తున్న ప్ర‌తీ సంఘట‌న జ‌గ‌న్‌రెడ్డి ప‌త‌నానికి నాంది కాబోతోంది. అంటూ లోకేష్ హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *